ముస్లిం అమ్మాయిని పెళ్లాడితే.. రూ.2.5లక్షల నగదు బహుమతి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 16, Aug 2018, 12:03 PM IST
Marry a Muslim girl, get a reward of 2.5 lakh: BJP Yuva Morcha
Highlights

ముస్లిమ్ బాలికను పెళ్లాడండి...రెండున్నర లక్షల రూపాయల నగదుతో పాటు ఆరునెలలపాటు ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలను పొందండి అంటూ హిందూ యువమోర్చా సంస్థ అధికార ప్రతినిధి చేసిన ప్రకటన వీడియో ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది. 

ఏవరైనా హిందూ మతానికి చెందిన యువకుడు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. వారికి రూ.2.5లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇలా ప్రకటించింది మరెవరో కాదు.. బీజేపీ యువమోర్చా. మీరు చదివింది నిజమే.. బిజేపీ యువమోర్చా కి చెందిన వ్యక్తులు ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో ద్వారా ప్రకటించారు.

ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ముస్లిమ్ బాలికను పెళ్లాడండి...రెండున్నర లక్షల రూపాయల నగదుతో పాటు ఆరునెలలపాటు ఉచితంగా భోజనం, వసతి సౌకర్యాలను పొందండి అంటూ హిందూ యువమోర్చా సంస్థ అధికార ప్రతినిధి చేసిన ప్రకటన వీడియో ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది. 

బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య కులానికి చెందిన యువకులెవరైనా ముస్లిమ్ బాలికను పెళ్లాడితే చాలు వారికి రివార్డు ఇవ్వడంతోపాటు వారి రక్షణ బాధ్యత తాము చూసుకుంటామని అఖిల భారత హిందూ యువమోర్చా ప్రకటించింది. గురువారం నుంచి ప్రతీ భారత హిందువు ఇంటిపై ఓ కత్తి, కాషాయ జెండా పెట్టాలని అఖిల భారత హిందూ యువమోర్చా ప్రచారం చేపట్టింది. కాగా బీజేవైఎం పేరిట రూమర్లు ప్రచారం చేస్తున్నారని ఓ వరదరాజ్ అనే నెటిజన్ వ్యాఖ్యానించారు. 

loader