తనను మోసం చేసి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకి ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు ఓ భర్త.  భార్యను, ఆమె ప్రియుడు కలిసి చేస్తున్న తప్పుని చుట్టు పక్కల వారందరికీ ప్రత్యక్షంగా చూపించాడు. ఈ సంఘటన బిహార్ లోని గోపాల్ గంజ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాదేవుర్ గ్రామానికి చెందిన ఒక యువతికి 2018లో బగ్హవా గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. తరువాత వారి వైవాహిక జీవితం చక్కగానే సాగింది. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రతీరోజూ పొలం పనుల మీద వెళ్లిపోయేవారు. ఒకరోజు భర్త మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో భార్య వేరొకరితో అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని చూశాడు. 

దీంతో ఇంటి తలుపులు బయటినుంచి వేసి, చుట్టుపక్కలవారిని పిలిచి ఈ విషయం తెలిపాడు. అందరిముందు ఆ యువకుడిని ప్రశ్నించగా తాము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలీసులు ఇరు కుటుంబాల వారినీ పిలిచి విచారిస్తున్నారు.