ప్రముఖ సోషల్ మీడియా మ్యూజిక్ యాప్ టిక్ టాక్ అతి కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఈ యాప్ లో రకరకాల వీడియోలు చేస్తూ... వాటి ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకోవాలని యువత తెగ తాపత్రయపడుతోంది. కాగా... తాపత్రయమో కొందరి ప్రాణాలు కూడా తీస్తోంది. 

ఇటీవల ఓ మహిళ టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ... కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే... ఇలాంటి సంఘటనే మరొకటి చేసుకుంది. ఓ వివాహిత టిక్‌టాక్ చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్‌లో జరిగింది. భర్త తిట్టాడని   ఆమె టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... అప్పటికే  చనిపోయినట్లు వెల్లడించారు. కాగా... ఆమె సూసైడ్ వీడియో టిక్ టాక్ లో వైరల్ గా మారింది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.