ఆమె అతడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తినే భర్తగా పొందింది. తాను కలలు కన్న ప్రపంచంలోకి అడుగుపెట్టి కనీసం ఏడు నెలలు కూడా గడవకముందే.. ఆమె శవమైంది. రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిచింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్ర దుర్గ ప్రాంతానిాకి చెందిన అరుణాక్షి(22) బెంగళూరులోని ఓ కాళాశాలలో డిగ్రీ చదువుకుంది.  ఆ సమయంలో కాలేజీ కి సమీపంలో నివసిస్తున్న ఓ డ్రైవర్ శివకుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.

Also Read రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: నదిలో పడ్డ పెళ్లి బస్సు, 24 మంది మృతి...

అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వారిని ఎదురించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవలు రావడం మొదలయ్యాయి.  ఈ క్రమంలో తరచూ గొడవపడేవారు. కాగా.. సోమవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో బ్యాగులో బట్టలు సర్దుకుంది.

భర్తకు ఫోన్ చేసి తాను తన పుట్టింటికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిపోయింది. తీరా చూస్తే మంగళవారం రైలు పట్టాల మీద శవంగా కనిపించింది. ఆమెది హత్య, ఆత్మహత్య అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే.. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద హత్య కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.