ఆమెకు అప్పటికే పెళ్లైంది. అతనికి కూడా పెళ్లైంది. ఆమె తన భర్తని.. అతను ఆమె భార్యను వదిలేశారు. వీరిద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలం పాటు సహజీవనం చేశారు. కాగా... ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అతను ఆశపడ్డాడు అయితే... అందుకు  ఆమె అంగీకరించలేదు... దీంతో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. తనతో పెళ్లి వద్దు అన్నదనే కోపంతో దారుణంగా ఆమెను హత్య చేశాడు.  ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కోవై కాళపట్టి 6వ వీధికి చెందిన పద్మనాభన్‌ (37)కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పద్మనాభన్‌ ప్రవర్తన నచ్చని భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అలాగే, అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్‌ భార్య తిలకవతి (33) భర్త వదలి వేరుగా నివసిస్తోంది.  ఈ నేపథ్యంలో పద్మనాభన్‌కు తిలకవతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

 ఈ నేపథ్యంలో తనను వివాహం చేసుకోవాలని పద్మనాభన్‌ కోరగా అందుకు తిలకవతి సమ్మతించలేదు. ఈ విషయమై రెండు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకొని ఇద్దరు కలుసుకోవద్దని హెచ్చరించినా వారు ఎవరికీ తెలియకుండా కలుసుకుంటుండేవారు. 

ఈ నేపథ్యంలో, సోమవారం సాయంత్రం  తరచూ కలుసుకొనే ఇంట్లో వారిద్దరూ చేరారు. తనను వివాహం చేసుకోవాలని పద్మనాభన్‌ మరో సారి తిలకవతిని గట్టిగా ప్రశ్నించగా అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన పద్మనాభన్‌ గోడ పక్కనే ఉన్న సమ్మెటతో తిలకవతి తలపై బాధడంతో తీవ్రగాయాలతో సంఘటనాస్థలంలోనే ఆమె మృతిచెందింది. 

దీంతో దిగ్ర్భాంతికి గురైన పద్మనాభన్‌ పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న భయంతో అదే ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పీళమేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.