Asianet News TeluguAsianet News Telugu

మైనర్ తో వివాహిత అక్రమ సంబంధం.. కత్తెరతో పొడిచి, నిప్పంటించి యువతి హత్య..

ఈ దారుణానికి కారణం ఆమె బంధువైన puc student (17) అని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే accused కుటుంబం కొత్తగా ఇల్లు కడుతుంది. ఈ క్రమంలో అబ్బాయి ఆమె ఇంటికి  తరచు వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య Extramarital affair ఏర్పడింది. 

married woman murder mystery solved in karnataka
Author
Hyderabad, First Published Oct 22, 2021, 8:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక :  బెంగళూరు బనశంకరిలోని yarab nagar లో మహిళ టైలర్ అఫ్రినా ఖానం (28)  హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తితో పొడిచి చంపి మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యారు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి.

illegal affairs, క్షణికమైన కోరికలు దారుణాలకు ఒడిగట్టేలా ప్రేరేపిస్తాయి. ఇలాంటి రిలేషన్స్ ఆ సమయంలో బాగున్నా.. కాలం గడిచినకొద్దీ నేరానికే దారి తీస్తాయి. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపడం, భార్యను హతమార్చడం చాలాసార్లు కనిపిస్తుంది.

కానీ, సంబంధం పెట్టుకున్న వ్యక్తే ప్రియురాలిని దారుణంగా చంపడం ఇక్కడ కొసమెరుపు. అదీ అత్యంత దారుణంగా.. కత్తెరతో పొడిచి, బట్టలు మీద పడేసి నిప్పుపెట్టి.. పరారవ్వడం షాక్ కు గురి చేస్తుంది. 

ఈ దారుణానికి కారణం ఆమె బంధువైన puc student (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే accused కుటుంబం కొత్తగా ఇల్లు కడుతుంది. ఈ క్రమంలో అబ్బాయి ఆమె ఇంటికి  తరచు వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య Extramarital affair ఏర్పడింది. 

దీంతో ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దాం అని,  హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా,  అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బులు ఇవ్వాలని ఆమెను అతడు పీడించే వాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  

95శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు: యూపీ మంత్రి

అబ్బాయి Scissors తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు.  పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

కాగా, బుధవారంనాడు పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరి మహిళ ను కత్తెరతో పొడిచి చంపాడు. ఈ ఘటన బసశంకర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఇది స్థానికంగా కలకలం రేపింది.  yarab nagar 16వ క్రాస్ నివాసి  టైలరింగ్ చేసే  ఆఫ్రీనా ఖానం  ఈ ఘటనలో హతురాలి అయింది.  ఆమెకు భర్త లాలూ ఖాన్ తో పాటు,  3,5 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పిల్లలు ఆమె పుట్టింట్లో ఉంటున్నారు. భార్య ప్రవర్తన పై  అనుమానం వచ్చిన భర్త తరచుగా ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు.  భర్త ఓ టింబర్ డిపో లో పని చేసేవాడు. మంగళవారం సైతం ఇలాంటి గలాటా జరిగింది.  భర్త పనికి వెళ్లి పోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు. 

కొంతసేపటికి అక్కడే ఉన్న తీసుకొని ఆమెను పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు  కుప్పగా వేసి నిప్పంటించి వెళ్ళిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. 

వారు వచ్చి తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లి  చూడగా  పరుపు, మృతదేహంపై  బట్టలు కాలిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలించారు.  కేసు మీద దర్యాప్తు చేసిన పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios