జైపూర్: ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి అత్తారింటి నుంచి పారిపోయింది.. ఈ విషయం తెలిసిన వివాహతి తండ్రి ఆగ్రహంతో స్వగ్రామం నుంచి వచ్చి కూతురు వెళ్లిపోయిన కుటుంబంలోని ఇద్దరిని దారుణంగా చంపేశాడు.

రాజస్థాన్ లోని జున్డును జిల్లాలో సోమవారం ఆ సంఘటన జరిగింది. హర్యానాకు చెందిన అనిల్ జాట్ తను కూతురును రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అత్తగారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోడలు కనిపించడం లేదని అత్తింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

విషయం తెలిసిన వివాహిత తండ్రి అనిల్ జాట్ హర్యానా నుంచి బైక్ మీద రాజస్థాన్ లోని గ్రామానికి వచ్చాడు. కోపంతో తన కూతురిని తీసుకుని వెళ్లిన వ్యక్తి ఇంటికి వెళ్లి డాబాపై నిద్రిస్తున్న అతడి సోదరుడు దీపక్ ను, మిత్రుడు నరేష్ ను గొడ్డలితో నరికి చంపేశాడు. 

తెల్లారిన తర్వాత విషయాన్ని గ్రహించిన దీపక్ తండ్రి రాజ్ వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశఆడు. దాంతో డాగ్ స్క్వాడ్ ను రప్పించి నిందితుడి కోసం గాలించారు. అదే విధంగా సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

తన పరువు తీసిన కూతురితో పాటు ఆమెను తీసుకుని వెళ్లిన వ్యక్తిని, అతడి తండ్రిని జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత చంపేస్తానని అనిల్ జాట్ అన్నట్లు పోలీసులు తెలిపారు.