Asianet News TeluguAsianet News Telugu

లాయర్ చాంబర్‌లో కూడా దండలు మార్చుకుని పెళ్లి చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. లాయర్ చాంబర్‌లోనైనా పెళ్లి చేసుకోవచ్చని వివరించింది. పూల దండలు మార్చుకుని, ఉంగరం తొడిగించి, తాళి కట్టి పెళ్లి చేయవచ్చని తెలిపింది. మద్రాస్ హైకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
 

marriage can perform in lawyer chamber says supreme court kms
Author
First Published Aug 28, 2023, 8:44 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సోమవారం కీలక రూలింగ్ ఇచ్చింది. అడ్వకేట్ చాంబర్‌లో కూడా ఒక జంట పూల దండలు మార్చుకుని లేదా చేతి వేలికి ఉంగరం తొడిగించి లేదా తాళి కట్టి పెళ్లి చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హిందూ చట్టంలోని సెక్షన్స్ 7, 7-ఏ ప్రకారం కొంత మంది అపరిచితుల నడుమ రహస్యంగా చేసుకున్న పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్‌ల ధర్మాసనం మద్రాస్ హైకోర్టును తోసిపుచ్చుతూ కోర్టు ఆఫీసర్లుగా కాకుండా మిత్రులు/బంధువులు/సామాజిక కార్యకర్తల కెపాసిటీలో లాయర్లు పెళ్లి చేయవచ్చు. హిందూ మ్యారేజీ యాక్ట్ సెక్షన్ 7(ఏ) (తమిళనాడు రాష్ట్ర సవరణ చట్టం) కింద ఈ పెళ్లి చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Also Read: స్టీల్ ప్లాంట్ కోసం కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష.. ‘10 లక్షల ఉద్యోగాలిప్పిస్తా’

ఇద్దరు హిందువులు బంధువులు, మిత్రులు, లేదా ఇతరుల సమక్షంలో చేసుకునే పెళ్లికి సెక్షన్ 7 - ఏ వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం వివరించింది. ఈ సెక్షన్‌లో కీలకమైనదేమిటంటే.. పురోహితుడు లేకున్నా చెల్లుబాటు అయ్యే వివాహం అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios