చెన్నై: భర్తతో  తీవ్రంగా గొడవపడిన ో వివాహిత తన ఆరేళ్ల కొడుకును కిరోసిన్ పోసి  అత్యంత దారుణంగా సజీవ దహనం చేసింది.ఈ ఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని కారయంచవాడికి చెందిన 27 ఏళ్ల మీనాక్షికి కృష్ణగిరికి చెందిన శరవణన్ కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు శ్రీకాంత్ పుట్టాడు.అతని వయస్సు ప్రస్తుతం ఆరేళ్లు. ఇటీవల కాంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

దీంతో తన కొడుకును తీసుకొని మీనాక్షి పుట్టింటికి వెళ్లింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 27వ తేదీన మీనాక్షి పుట్టింటికి వచ్చిన భర్తతో  తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.ఈ గొడవతో  ఆమె ఆ రాత్రి పుట్టింట్లోని మోటార్ హౌజ్ లో రాత్రంతా కొడుకుతో ఉంది. భర్తతో గొడవ కారణంగా   నిద్రిస్తున్న ఆరేళ్ల కొడుకుపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసింది.

ఉదయాన్నే  మీనాక్షి కోసం ఆమె తల్లిదండ్రులు వెతికితే పూర్తిగా తగులబడిన శ్రీకాంత్ మృతదేహం లభించింది. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కారణంగా పోలీసులు మృతదేహం అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

మీనాక్షి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే సమయంలోనే  ఆమె తలనీలాలు సమర్పించుకొని తిరిగి ఇంటికి చేరింది. తన కొడుకును తానే హత్య చేసినట్టు  చెప్పింది. అంతేకాదు తాను కూడ చనిపోవాలని భావించి ధైర్యం చాలక చివరి నిమిషంలో ఆగిపోయినట్టు ఆమె చెప్పింది.