Marathi actor Ketaki Chitale: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్‌పై వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు చేసి.. దాదాపు 40 రోజుల‌ జైలు శిక్షను అనుభవించిన మరాఠీ నటి కేత్కి చితాలే.. ఆమె బయటకు వచ్చిన తర్వాత సంచలన ఆరోపణలు చేసింది.

Marathi actor Ketaki Chitale: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్‌పై వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు చేసి.. జైలు పాలైన మరాఠీ నటి కేత్కి చితాలే. ఇటీవ‌ల ఆమె బెయిల్ ద్వారా జైలు నుంచి విడుద‌లై.. బయటకు వచ్చిన తర్వాత సంచలన ఆరోపణలు చేసింది. ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ పై నటి కేత్కి చితాలే సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్‌ను పోస్ట్ చేసింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆమె దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభ‌వించింది. అనంత‌రం బెయిల్ పై జూన్ 22న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆమె ఓ ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక షాకింగ్ విషయాలు వెల్లడించింది. నా కష్టాలు ఇంత త్వరగా తీరుతాయని ఊహించలేదని, దీన్ని నమ్మలేక‌పోతున్నాన‌ని అన్నారు.

మరాఠీ నటి కేత్కి చితాలే ఇండియా టూడే కు ఇచ్చిన ప్ర‌త్యేక‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన న్యాయ వ్యవస్థ ఎంత విచిత్రంగా ఉంటుందో..? ఒక్క చిన్న కామెంట్ ను పోస్ట్ చేస్తే.. జైల్లో వేశారు. ఇంత దారుణ‌మా? అని ప్ర‌శ్నించారు. జైలు పాలైన క‌విత రాసింది నేను కాదు.. ఆ కవిత ఎవరో రాశారు. నేను దానిని కాపీ పేస్ట్ చేశాను. ఈ చిన్నకార‌ణంతో నన్ను జైలు కటకటాల‌ను లెక్కించేలా చేశారు. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా.. ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి అరెస్ట్ చేశారు. అలా చేయ‌డం తప్పు కాదా? అని ప్ర‌శ్నించారు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, నేరుగా వ‌చ్చి అరెస్టు చేశారు. ఒక్క చిన్న‌ పోస్ట్ చేస్తే ఇంత‌లా టార్గెట్ చేస్తారా? ఆ పోస్టులో నేను ఎవరినీ టార్గెట్ చేయలేదు. కానీ ఆ కవితను శరద్ పవార్‌కి లింక్ చేసి నాపై 22 ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు. అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

"నాపై దాడి చేసి.. వేధించారు"

త‌న జైలు జీవితాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసు కస్టడీ సమయంలో పోలీసులు తనని కొట్టారని నటి తెలిపింది. "చీర కట్టుకుంటే.. నన్ను వేధించారు. బలవంతంగా చీర బిగించడానికి ప్రయత్నించారు. కింద‌ప‌డేశారు. గుడ్లు, సిరా, విషపూరితమైన పెయింట్ నాపై విసిరారు. నా ఎద భాగాన్ని తాకేందుకు ప్రయత్నించారు" అని సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఫేస్‌బుక్ అభ్యంత‌క‌ర‌ పోస్ట్‌పై అరెస్టయిన కేతకి చితాలేకు జూన్ 22న థానే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

"నాకు ఉపశమనం ల‌భించింది. కాబట్టి చిరునవ్వుతో బయటకు వచ్చాను. కానీ నేను బెయిల్‌పై బయట ఉన్నాను. యుద్ధం ఇంకా కొనసాగుతోంది" అని చితాలే చెప్పింది. తనపై నమోదైన 22 ఎఫ్‌ఐఆర్‌లలో ఒకదానిలో మాత్రమే బెయిల్ పొందినట్లు తెలిపింది. త‌న‌ పోస్ట్ ద్వారా ఎవరినీ కించపరచలేదనీ, కానీ.. ప్రజలు దానిని త‌ప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. 

శరద్ పవార్‌కి వ్యతిరేకంగా పోస్ట్

మే 14, 2022న, NCP అధినేత శరద్ పవార్‌ను అవమానకరమైన రీతిలో ప్రస్తావించిన మరాఠీ పద్యాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసినందుకు చితాలేను థానే పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై ప‌లు సెక్షన్ కింద న‌మోదు చేశారు. ఈ పోస్ట్ రాజకీయ పార్టీల మధ్య ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని ఫిర్యాదుదారు స్వప్నిల్ నెట్కే తన ఫిర్యాదులో ఆరోపించారు. మహారాష్ట్రలో చితాలే 22 ఎఫ్‌ఐఆర్‌లు, నాలుగు నాన్-కాగ్నిసబుల్ నేరాలను ఎదుర్కొంటున్నారు. 2020లో నమోదైన అట్రాసిటీ కేసులో ఆమెను మే 20న రబలే పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో చితాలే జూన్ 16న బెయిల్ పొందారు.