జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

జార్ఖండ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు.. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను మావోలు అపహరించుపోయారు.