ఛత్తీస్‌ఘడ్:ప్రభుత్వంతోనే తమ పోరాటమని జవాన్లతో కాదని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో  24 మంది జవాన్లు మరణించారు. కోబ్రా కమాండో రాకేష్ సింగ్ మావోయిస్టుల బందీగా ఉన్నాడు.ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.ఈ ఎన్‌కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందించింది.ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల  చేసింది.  4 నెలల్లో 28 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేశారని ఆ ప్రకటనలో ఆరోపించింది. 

ఈ ఎన్ కౌంటర్లకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని  ఆ పార్టీ ప్రకటించింది.  తమ లక్ష్యం జవాన్లు కాదని  మావోయిస్టులు తేల్చి చెప్పారు.