ఛత్తీస్గడ్ : సెక్యూరిటీ క్యాంప్‌పై మావోల మెరుపుదాడి, ముగ్గురు పోలీసులు మృతి.. 14 మందికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని టేకుల గూడెంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 14 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని టేకుల గూడెంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంప్ పై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, 14 మంది పోలీసులు తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. గాయపడిన జవాన్లను జగదళ్‌పూర్‌లోని రిఫరల్ హాస్పిటల్‌కు హెలికాప్టర్‌లో తరలించారు.
సుక్మా జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సరిదిద్దడానికి, స్థానిక ప్రజలకు కనీస వసతులు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు టేకులగూడెం గ్రామంలో కొత్తగా సెక్యూరిటీ క్యాంప్ ఏర్పాటు చేశాయి. ఈ రోజే ఈ సెక్యూరిటీ క్యాంప్‌ను ప్రారంభించారు. అంతలోనే మావోయిస్టులు ఈ క్యాంప్ పై విరుచుకుపడ్డారు. సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అదనపు భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి బయల్దేరారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.