Asianet News TeluguAsianet News Telugu

ఏఎస్ఐ మురళి హత్య.. మావోయిస్టుల ఘాతుకం.. !

ఛత్తీస్ గఢ్, బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. తమ దగ్గర బందీగా ఉన్న ఏఎస్ఐ మురళిని హత్య చేశారు. ఆ తరువాత మురళీ మృతదేహాన్న గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. 

maoists assassinated asi murali in chhattisgarh - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 1:05 PM IST

ఛత్తీస్ గఢ్, బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. తమ దగ్గర బందీగా ఉన్న ఏఎస్ఐ మురళిని హత్య చేశారు. ఆ తరువాత మురళీ మృతదేహాన్న గంగుళూరు వద్ద రహదారిపై పడేశారు. 

మృదేహం వద్ద ఒక లేఖను వదిలి వెళ్లారు. ఈ నెల 21న గంగుళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలనార్ గ్రామంలో ఏఎస్ఐ మురళీని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల తరువాత కిడ్నాప్ ఘటన విషాదాంతం అయ్యింది. 

మురళిని విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నప్పటికీ మావోయిస్టులు కనికరించలేదు. ఏఎస్ఐ విడుదలకు గోండ్వానా సమాజ్ కో ఆర్డినేషన్ కమిటీ యత్నించిన సంగతి తెలిసిందే. చర్చలు జరిపే సమయంలోనే మురళీని మావోయిస్టులు హత్య చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios