Asianet News TeluguAsianet News Telugu

ప్రజా దర్భార్‌లో యువకులకు వార్నింగ్: ఛత్తీస్‌ఘడ్‌లో ఏడుగురిని విడుదల చేసిన మావోలు

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో కిడ్నాప్ చేసిన  ఏడుగురు యువకులను మావోయిస్టులు వదిలివేశారు. ఈ నెల 18వ తేదీన వారిని మావోలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్  గురైన  యువకులను ప్రజా దర్భార్ లో విచారణ నిర్వహించి  వదిలేశారు.

maoist released 7 teenagers after three days in Chhattisgarh lns
Author
Chhattisgarh, First Published Jul 21, 2021, 3:03 PM IST


 రాయ్‌పూర్: ఈ నెల 18వ తేదీన ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు మొదటి తప్పుగా భావించి యువకులను వదిలివేశారు.రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందేడ్  గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు ఈ నెల 18వ  మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఏడుగురు యువకులను వెతికేందుకు వెళ్లిన నలుగురు గ్రామస్తులు కూడ అదృశ్యమయ్యారు.

also read:ఛత్తీస్‌ఘడ్‌లో ఏడుగురిని కిడ్నాప్ చేసిన మావోలు: వెతికేందుకు వెళ్లిన నలుగురు గ్రామస్తుల అదృశ్యం

 దీంతో గ్రామస్థులు  ఆందోళన చెందారు. పోలీసులు కూడ వారి కోసం వెతికారు.ఈ ఏడుగురు యువకులు పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్నారని  మావోయిస్టులు ఆరోపించారు. ప్రజా దర్భార్ నిర్వహించారు.  తొలి తప్పు కింద ఈ ఏడుగురు  యువకులను మావోయిస్టులు వదిలివేశారు.  భవిష్యత్తులో  ఈ తప్పులు చేయవద్దని  కూడ మావోయిస్టులు యువకులను హెచ్చరించారు.  ఈ విషయాన్ని మావోయిస్టుల ప్రతినిధి మీడియాకు తెలిపినట్టుగా ఛత్తీస్ ఘడ్ స్థానిక మీడియా ప్రకటించింది. ఏడుగురు యువకులు సురక్షితంగా రావడంతో  కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios