తెలంగాణ-ఛత్తీ‌స్ ఘడ్  రాష్ట్రాల సరిహద్దులో  ఇవాళ  జరిగిన  ఎన్ కౌంటర్ లో  ఒక మావోయిస్టు మృతి చెందాడు.  ఇరువర్గాల మధ్య  కాల్పులు చోటు  చేసుకున్నాయి. 

ఖమ్మం: తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఆదివారంనాడు ఎన్ కౌంటర్ జరిగింది . ఈ ఎేన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతీ చెందాడు. మరో వైపు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో గల చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది.

భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు మృతి చెందాడు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో కూంబింగ్ ను పెంచారు.

ఈ ఏడాది ఏప్రిల్ 26న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులు వల వేసి ఈ మందుపాతరను పేల్చారు. తమ ఉనికిని తెలిసేలా మావోయిస్టులు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన తర్వాత భద్రతా బలగాలు కూంబింగ్ కు వచ్చాయి. దీంతో మావోయిస్టుల వాహనం లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాతర పేల్చారు.

2018 మే మాసంలో దంతెవాడ జిల్లా చోల్నోర్ గ్రామంలో పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడడారు.