ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఐఈడి పేలుడు, జవాన్ కు తీవ్రగాయాలు...

ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలను మావోయిస్టులు  టార్గెట్ చేశారు. పేలుళ్లకు పాల్పడ్డారు.

Maoist IED blast in Chhattisgarh Sukma district, jawan seriously injured - bsb

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఐఈడి పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడులో జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలను మావోయిస్టులు  టార్గెట్ చేశారు. 

మరోవైపు ఈవీఎం మోరాయించడంతో మిజోరాం సీఎం ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని 90 సీట్లలో 20 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఇందులో 12 సీట్లు మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జోన్‌లో దాదాపు 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 2018లో మొత్తం 20 సీట్లకు గాను కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా, బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios