ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతేవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో పెట్రోలింగ్‌కు వెళుతున్న ఐటీబీటీ 44వ బెటాలియన్‌కు చెందిన 10 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసులు, సైన్యం, బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది