Asianet News TeluguAsianet News Telugu

వివేక్ మరణించాడనే బాధలో అలా అన్నాను.. సినీ నటుడు మన్సూర్

వివేక్ మరణంతో తాను ఉద్వేగానికి గురై ఆవేశంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని  మన్సూర్ పేర్కొన్నారు.
 

Mansoor ali khan files for bail after BJP files complaint against him for spreading fake news on Covid19
Author
Hyderabad, First Published Apr 20, 2021, 8:09 AM IST

సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్ మరణంతో తాను ఉద్వేగానికి గురై ఆవేశంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని  మన్సూర్ పేర్కొన్నారు.

వివేక్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న మరుసటి రోజున గుండెపోటుకు గురైన విషయం విధితమే. ఆ సమయంలో మన్సూర్‌ అలీఖాన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్‌ పేరుతో మంచం ఎక్కించారని ఆరోపించారు. ఇంతో వివేక్‌ కన్నుమూయడంతో మన్సూర్‌ ఆగ్రహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ను టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్‌ స్టంట్‌గా విమర్శించారు.


మన్సూర్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం వైరల్‌ కావడంతో చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రకాష్‌ స్పందించారు.  మన్సూర్‌పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో మన్సూర్‌పై వడపళని పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో మన్సూర్‌ అలీఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్‌ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కోర్టు మంగళ లేదా బుధవారాల్లో విచారించే అవకాశముంది.

Follow Us:
Download App:
  • android
  • ios