మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పిల్లల్లో శాస్త్రీయ స్వభావాన్ని పెంచేందుకు చర్యలు తీసకోవాలని కోరారు.
న్యూఢిల్లీ: పిల్లల్లో శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించేందుకు చిన్న చిన్న ప్రయత్నాలను ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.ప్రధాన మంత్రి Narendra Modi ఆదివారం నాడు Mann ki Baat లో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. క్యాలికులేటర్ ఎలా పనిచేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందనే విషయమై పిల్లలతో చర్చించాలని ఆయన కోరారు. కూతుళ్లు కొత్త, పెద్ద పాత్రల్లో భాద్యతలు నెరవేరుస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ ను ఆయన ఉటంకించారు. ఆధునిక యుద్ధ విమానాలను మహిళలు కూడా నడపడాన్ని ప్రస్తావిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వేల కొద్దీ కొత్త స్టార్టప్‌లలో మహిళలు డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నారని మోడీ వివరించారు.
Local భాషలకు వాటి ప్రత్యేక లక్షణాలున్నాయన్నారు. స్థానిక భాషల్లో అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక languages ల ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. మాతృ భాషకు స్వంత శాస్త్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలో అధ్యయనానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మోడీ తెలిపారు.
భాష కేవలం భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమేకాదు సమాజ, సంస్కృతి, వారసత్వాన్ని కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుందని మోడీ వివరించారు.ప్రపంచంలోనే పురాతన భాష తమిళం ఇండియాలోన ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రతి భారతీయుడు ప్రపంచంలోని అటువంటి ముఖ్యమైన వారసత్వాన్నికలిగి ఉన్నందుకు గర్వపడాలన్నారు. అనేక పురాతన గ్రంధాలు కూడా దేశంలోనే ఉన్నాయన్నారు. వాటి వ్యక్తీకరణ కూడా మన సంస్కృత భాషలో ఉన్న విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. టాంజానియా తోబుట్టువులు కిలీ పాల్, నిమాలు పాడిన పాటలను మోడీ ఈ సందర్భంగా ఉదహరించారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన వారిని మోడీ అభినందించారు.
కాశీ నుండి దొంగిలించిన అన్నపూర్ణాదేవి విగ్రహన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. దేశం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న థృక్పథానికి ఇది ఒక ఉదహరణగా ఆయన పేర్కొన్నారు. గత ఏడేళ్లలో 200 కంటే ఎక్కువ విగ్రహాలను అమెరికా, బ్రిటన్, హాలండ్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగూర్ వంటి దేశాల నుండి తిరిగి తీసుకొచ్చారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తుందని మోడీ వివరించారు.కరోనా సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు. మేడ్ ఇన్ ఇండియా తో వ్యాక్సిన్ తయారు చేయడానికి దోహదపడిందని మోడీ అభిప్రాయపడ్డారు.
ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి ప్రధాని వివరించారు. దేశంలో తక్షణ విడాకుల కేసులు చాలా తగ్గాయని మోడీ వివరించారు. ఈ మధ్య కాలంలో మహిళలకు ప్రసూతి సెలవులు పెంపు వింటి నిర్ణయాలు కూడా తీసుకొన్న విషయాన్ని మోడీ ప్రస్తావించారు.
మహిళల ధైర్యం, నైపుణ్యం, ప్రతిభకు ఎన్నో ఉదహరణలున్నాయన్నారు. స్కిల్ ఇండియా , ఎస్‌హెచ్‌జెలు, చిన్న లేదా పెద్ద పరిశ్రమలు అనే తేడా లేకుండా మహిళలు ప్రతి చోటా ముందున్నారని మోడీ చెప్పారు.
