Asianet News TeluguAsianet News Telugu

ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: మన్మోహన్ సింగ్ స్పందన ఇదీ.. (వీడియో)

అత్యంత మృదుభాషి అయిన మన్మోహ న్ సింగ్ పార్టీ నుంచి ఏ విధంగా ఒత్తిడిని ఎదుర్కున్నాడనే విషయాన్ని ట్రైలర్ వెల్లడించింది. ప్రత్యేకంగా సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

Manmohan Singh rejects to speak on The Accidental Prime Minister
Author
New Delhi, First Published Dec 28, 2018, 1:33 PM IST

న్యూఢిల్లీ: ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ పై మాట్లాడేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించారు. ట్రైలర్ పై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 

 

మన్మోహన్ సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకంలోని అంశాలను ఆధారం చేసుకుని ఆ సినిమాను నిర్మించారు. మన్మోహన్ సింగ్ బయోపిక్ అది. 

మన్మోహన్ సింగ్ కాంగ్రెసు పార్టీ 134వ ఆవిర్భావ వేడుకల కోసం పార్టీ కార్యాలయానికి వచ్చారు. మీపై నిర్మించిన సినిమాపై మీరు ఏమనుకుంటున్నారని మీడియా ప్రతినిధులు అడిగితే ఏమీ చెప్పకుండా దాటేసి వెళ్లిపోయారు. 

 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. ఆ సినిమా ట్రైలర్ గురువారం విడులదైంది. అత్యంత మృదుభాషి అయిన మన్మోహ న్ సింగ్ పార్టీ నుంచి ఏ విధంగా ఒత్తిడిని ఎదుర్కున్నాడనే విషయాన్ని ట్రైలర్ వెల్లడించింది. ప్రత్యేకంగా సోనియా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ నుంచి ఆయన ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా జనవరి 11వ తేదీన విడుదలవుతోంది. అనుపమ్ ఖేర్ భార్య కిరోన్ ఖేర్ బిజెపి ప్రజాప్రతినిధి. మూడు రాష్ట్రాల్లో ఓటమి తర్వాత పాలక బిజెపి ఈ సినిమాను వాడుకుని ప్రయోజనం పొందవచ్చునని, తాను రాజకీయాల్లో ఉంటే ఆ పనిచేయాలని చెప్పేవాడినని, కానీ తానో నటుడిని మాత్రమేనని, వాళ్లు నిర్ణయించుకుంటారని అనుపమ్ ఖేర్ అన్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios