తన భార్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ :ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇవాళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే,.
తన భార్య ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియాను పిటిషన్ దాఖలు చేశారు,.ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు జ్యూడీషీయల్ రిమాండ్ ను ఈ నెల 8వ వరకు ఢిల్లీ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ చివరి వారంలో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కింది స్థాయి కోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు కీలక దరశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దని దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్ధించారు. దీంతో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. మరో వైపు ఇదే కేసులో మార్చి 9న ఈడీ అధికారులు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి., ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
