ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరిపించాలని  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. ఈ మేర‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. 

ఢిల్లీలో ఆప్ వర్సెస్ ఎల్‌జీ వార్ ముగియలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. మనీష్ సిసోడియా పైగా ఎల్‌జీ వీకే సక్సేనాకు లేఖ రాశారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో 6000 కుంభకోణంపై విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకెళ్తే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరిపించాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు. ఈ మేర‌కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లెఫ్టినెంట్ గవర్నర్ "నకిలీ దర్యాప్తు" నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ పనిలో "జోక్యం" చేస్తున్నారని సిసోడియా ఆరోపించారు.

ఎంసీడీలో జరిగిన అవినీతిపై రెండు నెలల క్రితమే లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించామని, అయితే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ఎంసీడీలో ఆరు వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి గతంలో నేను రాసిన లేఖను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని సిసోడియా చెప్పారు. 

రెండు నెలల క్రితం.. తాను లేవనెత్తిన అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించలేదు. కానీ, ప్రభుత్వ పనిని ఆపేందుకు ఫేక్ కేసుల దర్యాప్తునకు ఆదేశించి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. కానీ, ఎంసీడీలో అవినీతిని చూడలేకపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికైన ప్రభుత్వ పనుల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటున్నారని లేఖలో సిసోడియా పేర్కొన్నారు.

మనీష్ సిసోడియా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఆరోపణలు చేశారు. త‌న‌ ఇంట్లో సీబీఐ దాడులు నిర్వహించింద‌నీ, త‌న‌నీ విచారించడం వల్ల.. త‌మ‌కు ఏమీ కాలేదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవడం, ప్రతిరోజూ తప్పుడు విచారణలు చేయడం ద్వారానే మీ దృష్టి నిలిచిపోయిందని సిసోడియా అన్నారు.

అంతే కాకుండా ఢిల్లీ పోలీసుల పనితీరును క్రమబద్ధీకరించే బాధ్యతను లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజ్యాంగం అప్పగించిందని, కానీ.. నగరంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) అధిపతిగా దాని నిర్వహణ బాధ్యత తనపై ఉందని, అయితే అందులో మాఫియా ఆక్రమించిందని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు ఉప ముఖ్యమంత్రి గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ఢిల్లీలో అత్యాచారాలను అరికట్టడంలో, నేరాలను తగ్గించడానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కేవలం రెండు, మూడు నెలల్లో ప్రజలు ఉపశమనం పొందుతారని సిసోడియా అన్నారు.

మా ప్రభుత్వం ఎవరికీ భయపడదు

ఆప్ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోందని, ఎలాంటి విచారణకు భయపడేది లేదని మనీష్ సిసోడియా అన్నారు. బీజేపీకి చెందిన ఎంసీడీ చేసిన 6000 కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నాన‌ని అన్నారు.