Manipur violence: మ‌ణిపూర్ లో అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఇంకా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం మణిపూర్ లో ఇంటర్నెట్ బ్యాన్ ను శనివారం వరకు పొడిగించింది. ఇక్క‌డ మే 3న ఇంట‌ర్నెట్ పై నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి సుమారు 10,000 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు. 

Manipur Extends Internet Ban: మ‌ణిపూర్ లోఅల్ల‌ర్ల నేప‌థ్యంలో ఇంకా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం మణిపూర్ లో ఇంటర్నెట్ బ్యాన్ ను శనివారం వరకు పొడిగించింది. ఇక్క‌డ మే 3న ఇంట‌ర్నెట్ పై నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి సుమారు 10,000 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మోహరించారు.

వివ‌రాల్లోకెళ్తే.. హింసాత్మకంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో మరింత అలజడి తలెత్తకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని జూన్ 10 వరకు మణిపూర్ ప్రభుత్వం పొడిగించింది. మే 3న ఈ నిషేధం విధించింది. మరో ఐదు రోజులు అంటే జూన్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. తమను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలన్న మైతీల డిమాండ్ పై ఇంఫాల్ లోయ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మైతీలు, కొండల్లో స్థిరపడిన కుకి తెగల మధ్య కొనసాగుతున్న జాతి హింస మే 3న ప్రారంభమైనప్పటి నుంచి 70 మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది.

శాంతిని పునరుద్ధరించడానికి మ‌ణిపూర్ లో సుమారు 10,000 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు. గత వారం తన పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణ‌మైన మైతీలు, కుకీలు శాంతిని పాటించాలనీ, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారి-2 వద్ద ఆంక్షలను ఎత్తివేసి నిత్యావసర వస్తువుల సరఫరాను నిర్ధారించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండల్లో సేనాపతి జిల్లా గుండా ప్రయాణించి లోయలోని రాజధాని ఇంఫాల్ కు వచ్చే ఈ రహదారి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరుకుల రవాణాకు ఏకైక మార్గం. మణిపూర్ లో హైవే దిగ్బంధం కొత్తేమీ కాదు, నిత్యావసర సరుకులు దెబ్బతినడంతో నిత్యావ‌స‌రాలు రికార్డు స్థాయి ధ‌ర‌ల‌కు చేరాయి.