Manipur Violence: హింసాత్మకంగా మారిన మణిపూర్ లో గవర్నర్ అనుసూయ ఉయికే అధ్యక్షతన కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ఈ కమిటీలో మాజీ ప్రభుత్వోద్యోగులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, జాతి సమూహాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 

Peace Committee set up in Manipur: ఇటీవ‌ల హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్ లో శాంతిస్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. హింసాత్మకంగా మారిన మణిపూర్ లో గవర్నర్ అనుసూయ ఉయికే అధ్యక్షతన కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ఈ కమిటీలో మాజీ ప్రభుత్వోద్యోగులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, జాతి సమూహాల ప్రతినిధులు కూడా ఉన్నారు. మణిపూర్ లోని వివిధ జాతుల సమూహాల మధ్య శాంతియుత చర్చలు, పరస్పర విరుద్ధమైన పార్టీలు/సమూహాల మధ్య చర్చలతో సహా శాంతిస్థాపన ప్రక్రియను ఈ ఆదేశం సులభతరం చేస్తుంది. ఈ కమిటీ సామాజిక ఐక్యతను, పరస్పర అవగాహనను బలోపేతం చేయాలి. వివిధ జాతుల సమూహాల మధ్య సుహృద్భావ కమ్యూనికేషన్ ను సులభతరం చేయాలనే ల‌క్ష్యాలు ఈ క‌మిటీ ముందున్నాయి. 

నెల రోజులకు పైగా రాష్ట్రమంతా హింసాత్మక ఘటనల్లో చిక్కుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో కేంద్రం బలగాలను మోహరించింది. వివిధ జాతుల మధ్య శాంతిని పెంపొందించడానికి రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని హోం మంత్రిత్వ శాఖ శ‌నివారం (జూన్ 10న) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, మణిపూర్ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సభ్యులు, మాజీ ప్రభుత్వోద్యోగులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ జాతుల ప్రతినిధులు కూడా ఉన్నారని ఆ ప్ర‌క‌ట‌న పేర్కొంది. "పరస్పర విరుద్ధమైన పార్టీలు-సమూహాల మధ్య శాంతియుత చర్చలు, సంప్రదింపులను సులభతరం చేయడం" కమిటీ ముందున్న లక్ష్యం.

ఈ కమిటీ సామాజిక ఐక్యతను, పరస్పర అవగాహనను బలోపేతం చేయాలనీ, వివిధ జాతుల మధ్య సుహృద్భావ కమ్యూనికేషన్ ను సులభతరం చేస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించినప్పుడు శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మే 3న ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో మైతీలను ఎస్టీ కేటగిరీలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగింది. ఏప్రిల్ 19న మణిపూర్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రంలో చెల‌రేగిన హింస‌లో 60 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప‌రిస్థితిని అదుపులోకి తీసుకురావ‌డానికి ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు ఇంట‌ర్నెట్ ష‌ట్ డౌన్ చేశారు.