Imphal: మ‌ణిపూర్ లో బీజేపీ నేత‌ల ఇళ్ల‌ను ప‌లువురితో కూడిన అల్ల‌రిమూక‌లు తగలబెట్టేందుకు ప్ర‌య‌త్నించాయి. సుమారు 1,000 మందితో కూడిన గుంపు ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని భవనాలను తగలబెట్టడానికి ప్రయత్నించారు. ఇంఫాల్ పట్టణంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ఇద్దరు పౌరులు గాయపడ్డారనీ, బీజేపీ నాయకుల ఇళ్లను తగలబెట్టే ప్రయత్నాలు జరిగాయని అధికారులు శనివారం తెలిపారు.

Manipur violence: మ‌ణిపూర్ లో బీజేపీ నేత‌ల ఇళ్ల‌ను ప‌లువురితో కూడిన అల్ల‌రిమూక‌లు తగలబెట్టేందుకు ప్ర‌య‌త్నించాయి. సుమారు 1,000 మందితో కూడిన గుంపు ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని భవనాలను తగలబెట్టడానికి ప్రయత్నించారు. ఇంఫాల్ పట్టణంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ఇద్దరు పౌరులు గాయపడ్డారనీ, బీజేపీ నాయకుల ఇళ్లను తగలబెట్టే ప్రయత్నాలు జరిగాయని అధికారులు శనివారం తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌ణిపూర్ లో ఇంకా హింసాత్మ‌క ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. రెండు వ‌ర్గాల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌.. ఈ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకోవ‌డానికి కార‌ణమయ్యాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ప‌లువురితో కూడిన అల్ల‌రిమూక‌లు బీజేపీ నేతల ఇళ్లను తగలబెట్టేందుకు యత్నించాయి. సుమారు 1,000 మందితో కూడిన గుంపు ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని భవనాలను తగలబెట్టడానికి ప్రయత్నించింది. ఇంఫాల్ పట్టణంలో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో ఇద్దరు పౌరులు గాయపడ్డారనీ, బీజేపీ నాయకుల ఇళ్లను తగలబెట్టే ప్రయత్నాలు జరిగాయని అధికారులు శనివారం తెలిపారు.

ఇంఫాల్ తూర్పు జిల్లాలో కొనసాగుతున్న జాతి ఘర్షణల సందర్భంగా హింసాత్మక ప్రభావిత కోనుంగ్ మమాంగ్ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా క్వాక్తా, చురచంద్ పూర్ జిల్లా కంగ్వాయ్ లలో రాత్రి పూట కాల్పులు సైతం చోటుచేసుకున్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఇంఫాల్ వెస్ట్ లోని ఇరింగ్ బామ్ పోలీస్ స్టేషన్ ను కూడా దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ఆయుధాలు చోరీకి గురికాలేదు. అల్లర్లను అడ్డుకునేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్, మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రాష్ట్ర రాజధాని గుండా అర్ధరాత్రి వరకు సంయుక్తంగా కవాతు నిర్వహించాయి.

సుమారు 1,000 మందితో కూడిన గుంపు ప్యాలెస్ కాంపౌండ్ సమీపంలోని భవనాలను తగలబెట్టడానికి ప్రయత్నించింది. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన భ‌ద్రతా బ‌ల‌గాలు గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించింది. ఎమ్మెల్యే బిశ్వజీత్ ఇంటిని తగలబెట్టేందుకు మరో గుంపు ప్రయత్నించింది. సింజెమైలోని బీజేపీ కార్యాలయాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత మరో గుంపు చుట్టుముట్టినప్పటికీ ఆర్మీ దళం చెదరగొట్టడంతో ఎలాంటి హాని జరగలేదు. అదేవిధంగా, ఇంఫాల్ లోని పోరంపేట సమీపంలో బీజేపీ (మహిళా) అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిని అర్ధరాత్రి సమయంలో ఒక గుంపు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని స‌మాచారం.