డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలీవాల్ పర్యటనకు అనుమతి నిరాకరించిన మణిపూర్ సర్కార్
Manipur Horror: లైంగిక హింస బాధితులను పరామర్శించేందుకు మణిపూర్ ప్రభుత్వం తనకు అనుమతి నిరాకరించిందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ ఆరోపించారు. జాతి హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో ఈ నెల 23న మలివాల్ పర్యటించాల్సి ఉంది. ఇద్దరు మహిళలను ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు లైంగికదాడి, నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడంతో మణిపూర్ లో పర్యటించే ప్రణాళికపై ఆమె ఇదివరకు మణిపూర్ డీజీపీకి లేఖ రాశారు.

Delhi Commission for Women Chairperson Swati Maliwal: లైంగిక హింస బాధితులను పరామర్శించేందుకు మణిపూర్ ప్రభుత్వం తనకు అనుమతి నిరాకరించిందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ ఆరోపించారు. జాతి హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో ఈ నెల 23న మలీవాల్ పర్యటించాల్సి ఉంది. ఇద్దరు మహిళలను ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు లైంగికదాడి, నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడంతో మణిపూర్ లో పర్యటించే ప్రణాళికపై ఆమె ఇదివరకు మణిపూర్ డీజీపీకి లేఖ రాశారు.
ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ మలీవాల్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి సైతం లేఖ రాశారు. ఈ నెల 23న రాష్ట్రంలో పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేసి నిజనిర్ధారణ నివేదికను సమర్పించాలని యోచిస్తున్నట్లు ఆమె మణిపూర్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. "మణిపూర్ కు వస్తానని చెప్పిన తర్వాత ప్రభుత్వం యూటర్న్ తీసుకుని హఠాత్తుగా అనుమతి నిరాకరించింది. ఇది దిగ్భ్రాంతికరమైనది..అసంబద్ధమైనది. లైంగిక హింస బాధితులను నేను ఎందుకు కలవలేను? వారిని కలిసే ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నాను. నన్ను ఎందుకు ఆపడానికి ప్రయత్నించాలి?" అని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, రాష్ట్ర పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
అయితే, తాను మణిపూర్ చేరుకుంటానని ఆమె బయలుదేరే ముందు మీడియాతో చెప్పారు. "లైంగిక దాడి బాధితులను కలిసేందుకు మణిపూర్ వెళ్లాలనుకుంటున్నాను. వారికి న్యాయ సహాయం, కౌన్సిలింగ్, నష్టపరిహారం అందేలా చూడాలని వెళ్తాను" అని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ చెప్పారు.