Asianet News TeluguAsianet News Telugu

అత్యాచార నిర్దోషికి ప్రభుత్వం బంపర్ ఆఫర్..!

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్‌ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

Manipur CM promises govt job to man wrongly jailed for 8 years in rape, murder case
Author
Hyderabad, First Published Jan 5, 2021, 1:51 PM IST

అత్యాచారం, హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. 8 సంవత్సరాలపాటు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత నిర్దోషి అని తేలింది. దీంతో.. ఎలాంటి తప్పు చేయకుండా శిక్ష అనుభవించిన అతనికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... 2013లో మణిపూర్‌లోని రిమ్స్‌లో పాథాలజీ విభాగానికి చెందిన ఓ విద్యార్ధిని హత్యాచారానికి గురయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సహచర విద్యార్ధి తౌడమ్ జిబల్ సింగ్‌ను చేరుస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అనూహ్యంగా ఎనిమిదేళ్ల అనంతరం జిబల్‌ సింగ్‌ నిర్దోషి అని తేలింది. దీంతో అతడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. 

'ఈ కేసులో అమాయకుడైన జిబల్ సింగ్‌ జైలు చేయని నేరానికి జైలు  శిక్ష అనుభవించాడు. అంతేకాకుండా ప్రజలు అతని ఇంటిని సైతం దహనం చేశారు. ఈ నేపథ్యంలో అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా నిర్ణయించాం' అని సీఎంపేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో సంతోషంలో మునిగిన  జిబల్‌ సింగ్‌ జైలు నుంచి విడుదల కాగానే  సీఎం బీరెన్ సింగ్‌ను కలిశారు.

Follow Us:
Download App:
  • android
  • ios