మంగళూరు: మంగళూరు హింస వెనకున్న అసలైన కారకులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ముందడుగు వేశారు. సీసీటీవీ కెమెరాల్లో హింసకు కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. ముసుగులు ధరించి వీరు హింసకు తెగబడ్డారు. 

మొన్న జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు హాస్పిటల్ లోపలి చొరబడ్డ వీడియో ఒకటి బయటకు రావడంతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాస్తవంగా వారు ఆ ఆసుపత్రిలోకి వెళ్లి దాక్కున్నా ఆ గ్యాంగ్ ని పట్టుకునేందుకు పోలీసులు ప్రవేశించారు. 

వాస్తవానికి ఆ గ్యాంగ్ వారు మొఖానికి గుడ్డలు కట్టుకొని, వారిని గుర్తుపట్టకుండా ఉండడం కోసం అలా హింసకు దిగారు. ప్రస్తుత సీసీటీవీ ఫుటేజీని గనుక పరిశీలిస్తే అందులో ఆ దుండగలు ముఖానికి గుడ్డలు కట్టుకొని సీసీటీవీ కెమెరాలను కర్రలతో పక్కకు తిప్పుతున్న దృశ్యాలను వేరే సీసీటీవీ కెమెరాలు బంధించాయి. వారు అన్నిటిని తొలగించాం అని అనుకున్నప్పటికీ కొన్నింటిని వారు గమనించలేదు. 

ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఇప్పుడు వాస్తవిక పరిస్థితులను కళ్లకుగాట్టినట్టు చూపెడుతున్నాయి. ఈ వీడియోలను చూస్తే పోలీసులు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించవలిసి వస్తుందో మనకు అర్థమవుతుంది.