మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటి సుమలత... అత్యంత మెజార్టీతో గెలుపొందారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను ఆమె సునాయాసంగా ఓడించారు.

సీఎం సహా ము గ్గురు మంత్రులు, ఐదుమంది ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వెనుకడుగు వేయకుం డా ఎవరినీ విమర్శించకుండా ముందుకెళ్ళారు. ఆమె గెలుపు ఏకంగా రాష్ట్ర రాజకీయాల మార్పుకు పునాది వేసినట్లయ్యింది. సొంత కొడుకును గెలిపించుకోలేని ముఖ్యమంత్రిగా కుమారస్వామి చెడ్డపేరు తెచ్చుకున్నారు.
 
సుమలత ఏకైకవారసుడు అభిషేక్‌ అంబరీశ్‌ ఇప్పుడిప్పుడే సినిమాలలోకి అడుగు పెట్టారు. ఇలా సుమలత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినా జాతీయస్థాయిలో ఆమె పోటీ పెనుసంచలనమైంది.

 కాగా... ఇప్పుడు సుమలతకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది.ఆమె ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసినా...ఆమె గెలుపు కోసం బీజేపీ సహాయపడింది.  ఈ క్రమంలో.. ఈ ఫలితాల అనంతరం ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె కనుక బీజేపీలో చేరేందుకు సముఖంగా ఉంటే... మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.