Asianet News TeluguAsianet News Telugu

ఇక కారులో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండాల్సిందే... అక్టోబర్ 1 నుంచి అమలు : తేల్చిచెప్పిన కేంద్రం

దేశ వ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పకుండా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. 

mandatory to provide six air bags in cars from October 1st says union minister Nitin Gadkari
Author
First Published Sep 29, 2022, 2:40 PM IST

అక్టోబర్ 1 నుంచి కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా వుండాలని తేల్చిచెప్పింది. ఇకపై అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా వుండాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 

కాగా.. ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేటీఎస్ తులసి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజ్యసభలో గడ్కరీ ఎయిర్ బ్యాగ్స్ ప్రస్తావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాల ప్రకారం ఈవీలను తప్పనిసరిగా తయారుచేయాలని గడ్కరీ తెలిపారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (EV) కోసం భారతదేశం భద్రతా ప్రమాణాలు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయ‌న్నారు. 

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని ఫలితంగా దాదాపు 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ సభకు తెలియజేశారు. కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో తగిన రహదారి భద్రత చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీ ప్రాంతీయ అధికారులు, జాతీయ రహదారుల ప్రాజెక్ట్ డైరెక్టర్లను కోరారు.  రోడ్డు భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించేందుకు రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల కమిటీ మొదటి సమావేశం మార్చి 24న జరిగింది. గడ్కరీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన విష‌యం తెలిసిందే. 

ALso Read:Airbags in car: ఇక‌పై కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు.. స్ప‌ష్టం చేసిన నితిన్ గడ్కరీ

రహదారి భద్రతకు సంబంధించిన ఈ నియమం అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తుందని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎయిర్‌ బ్యాగ్స్‌ల సంఖ్య పెంచడంతో కార్ల కంపెనీలు కార్ల ధరలను పెంచుతాయి. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం భారతదేశంలో ముఖ్యమైనది. ఇది పెద్ద కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వాహనాలు ఉండనున్నాయి. ఇలా ఎయిర్‌బ్యాగ్స్‌ అన్ని సీట్లకు ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్నవారంత సురక్షితంగా బయటపడవచ్చు. అన్ని ప్యాసింజర్ వాహనాలకు కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసింది.

డ్రైవర్‌కు ఎయిర్‌బ్యాగ్‌ తప్పనిసరి చేస్తూ జూలై 2019 నుండి అమలు చేయబడింది. అయితే జనవరి 1, 2022 నుండి ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు ఇది తప్పనిసరి చేయబడింది. ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, పక్కపక్కనే ఢీకొనడం వంటి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయాణికులను సురక్షితంగా ఉంచేందుకు వాహనాల్లో మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది కేంద్ర రవాణా శాఖ. వెనుక సీట్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, రెండు ట్యూబ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల ప్రయాణికులందరికీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చే దిశగా ఇదొక ముందడుగు అని గడ్కరీ అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో హైవేలపై మొత్తం 1.16 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగగా, ఇందులో 47,984 మంది మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios