భార్య కళ్లుగప్పి చాటుమాటుగా వివాహేతర సంబంధం కొనసాగించాడో భర్త. అది కాస్తా భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో అతడిని, ప్రియురాలిని నగ్నంగా ఊర్లో ఊరేగించింది ఆమె.  

చత్తీస్ గఢ్ : అప్పటికే పెళ్లయి ఓ వ్యక్తి Loverతో కలిసి ఏకాంతంగా గడుపుతున్న టైంలో Red Handed గా దొరికిపోయాడు. extramarital affairన్ని రచ్చకీడ్జే ఉద్దేశంతో వాళ్ళిద్దరినీ అలా Nakedగానే బయటకు ఈడ్చుకు వచ్చింది అతని భార్య. చత్తీస్ గడ్, కొండాగావ్ కు చెందిన ఓ వ్యక్తి (25) స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య (23) ఊరెళ్ళిందనుకుని.. ఇంట్లోనే దుకాణం పెట్టాడు ఆ వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో ఆమె తిరిగి వచ్చింది. వాళ్ళిద్దరి బాగోతాన్ని చూసి షాక్ తింది. అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకుని టైం కూడా ఇవ్వలేదు. 

చుట్టుపక్కల వాళ్ల సహాయంతో అలాగే బయటికి నగ్నంగా ఈడ్చుకు వచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో అతను అతడిని, ప్రేయసిని చేతులు వెనక్కి కట్టించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపు లో విపరీతంగా వైరల్ అయ్యాయి. జూన్ 11వ తేదీన ఈ ఘటన జరగగా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్మెంట్ ల ప్రకారం… ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్య తో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. 

ఇదిలా ఉండగా, మే 30న తెలంగాణలోని ఖమ్మంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీరబాబు అనే వ్యక్తి తన భార్యను, ఆమె ప్రేమికుడు నవీన్ ని కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు రక్తం మడుగులో పడి ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరబాబు భార్య కల్పన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన భార్య కల్పనతో నవీన్ extramarital affair పెట్టుకున్నాడనే కోపంతోనే వీరబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం అల్లీపురంలో జరిగింది.

కాగా యువకుడికి 20 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ అయ్యింది. జూన్ 9వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే… అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో కాంట్రాక్టు పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కల్పన అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న కల్పన భర్త వీరబాబు దారుణానికి ఒడిగట్టాడు.

ఆ రోజు రాత్రి నవీన్ ను ఖమ్మం శివారు ప్రాంతం గోపాలపురం వద్దకు రమ్మని కల్పన ఫోన్ చేయడంతో అతను అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత కల్పన భర్త వీరబాబు నవీన్ మీద విచక్షణారహితంగా కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యి అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో కల్పనకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నవీన్ బంధువులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ నవీన్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇరవై రోజుల క్రితం నవీన్కు ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 9న మృతుడు నవీన్ కు వివాహం జరగాల్సి ఉంది. మరోవైపు పథకం ప్రకారమే కల్పన, వీరబాబు నవీన్ ను గోపాలపురానికి పిలిచి హత్యా యత్నం చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.