అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట : కరసేవకు వెళ్లి చనిపోయాడనుకున్న వ్యక్తి... సజీవంగా సొంతూరుకు...

అయోధ్య కరసేవకు వెళ్లిన యువకుడు మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబసభ్యులు అతనికి అంతిమసంస్కారాలు చేశారు. కానీ ఆశ్చర్యంగా అతను ఇంటికి తిరిగివచ్చాడు. దీంతో కుటుంబసభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

Man who was picked up by his family after knowing about his death,returned alive from Ayodhya - bsb

జైపూర్ : ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది. రామజన్మభూమి కేసులో కరసేవలో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు చెందిన పలువురు వెళ్లారు. ఇందులో రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలోని సంగనేర్ గ్రామం నుండి కూడా చాలా మంది వెళ్లారు. వారిలో గోవింద్ నారాయణ్ కూడా ఒకరు. కరసేవకు వెళ్లిన తర్వాత వచ్చిన వార్తల కారణంగా కుటుంబ సభ్యులు ఆయన చనిపోయాడని భావించారు. దీంతో మరణానంతన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన బతికే ఉన్నారనే వార్త రావడంతో అందరూ సంతోషించారు.

జనవరి 22న శంకుస్థాపన
జనవరి 22న శ్రీరాముని ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సమయంలో రామాలయం, కరసేవకుల గురించి ప్రతీచోటా మాట్లాడుకుంటున్నారు. రాజధాని జైపూర్‌ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాగి పట్టణానికి చెందిన గోవింద్ నారాయణ్ చౌహాన్ కూడా కరసేవ చేయడానికి 37 మంది స్నేహితులతో కలిసి సంగనేర్‌కు బయలుదేరారు.

రామాయణం ట్రెండింగ్ : నేటి తరంకోసం టీవీ షోలు, ఏఐ అవతార్‌లు, బోర్డ్ గేమ్‌లు ఎక్కడ చూసినా రాముడు, సీతలే...

1990లో వీరంతా రైలులో ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. అయితే, అయోధ్య ప్రాంతానికి వెళ్లకుండా వారిని అక్కడే నిలిపివేశారు. ఆ పరిస్థితిలో, గోవింద్, అతని నలుగురైదుగురు సహచరులు, లక్నో పొలాల గుండా నడుస్తూ, ఒకటి, రెండు రోజుల్లో సరయూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అలుపెరుగకుండా అలా నడవడంతో అతని పాదాలకు బొబ్బలు వచ్చి రక్తస్రావం మొదలైంది. అక్కడున్న స్థానికుడు అతనికి చికిత్స అందించాడు.

కరసేవకులపై లాఠీచార్జి 
నవంబర్ 2న హిందూ నాయకురాలు ఉమాభారతి ఆయుధాలు లేకుండానే రాంలీలా జన్మస్థలానికి చేరుకుంటానని ప్రకటించారు. అయితే అందరినీ మధ్యలోనే ఆపేశారు. వేలాది మంది సేవకులు నిరసనగా వీధుల్లో బైటాయించారు. వీరిపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. షూటింగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

కాల్పుల్లో మృతులు
కొంత సేపటికి కాల్పులు ప్రారంభమయ్యాయి, ఇందులో గోవింద భాగస్వామి మహేంద్రపై కూడా కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో గోవింద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం ఎవరో తీసుకెళ్లారు. ఆయనకు ఆస్పత్రిలో 14 కుట్లు పడ్డాయి. దీని తర్వాత, రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు కరసేవక్‌లను కాల్చిచంపినట్లు వార్తాపత్రికలో వార్త ప్రచురించబడింది.

ఈ వార్త చూసిన కుటుంబ సభ్యులు గోవింద్ చనిపోయాడని భావించారు. ఇక అతని ఆత్మకు శాంతి కలగాలని.. ఇంట్లో అన్ని కర్మలు చేశారు. ఆయన పేరుతో సభ కూడా జరిగింది. అయితే ఆసుపత్రిలో చేరినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రైలులో గోవింద్ ను రాజస్థాన్‌కు పంపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios