మైనర్ బాలిక మీద బంధువైన ఓ కామాంధుడు లైంగికదాడి చేశాడు. దీంతో ఆ బాలిక తండ్రి అతడిని చంపేశాడు. తల, మొండెం వేరు చేసి.. శరీరభాగాలను నదిలోకి విసిరేసి కసి తీర్చుకున్నాడు. 

ఖాండ్వా : మధ్యప్రదేశ్‌లో brutal murder జరిగింది. అయితే ఈ హత్య వెనుక మరో పాశవిక కోణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి నదిలోకి విసిరేశారు. ఆ శరీరాభాగాలు నదిలో తేలుతుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ జరపగా ఓ మైనర్ బాలిక తండ్రి, మామ ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. 

Madhya Pradeshలోని ఖాండ్వా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హతుడు Minor బాలికపై Sexual harassmentకు పాల్పడ్డాడని తేలింది. దీంతో ఆ బాధితురాలి తండ్రి, మామ కలిసి అత్యాచారానికి పాల్పడిన సదరు మృతుడిని murder చేసి, dead bodyని ముక్కలుగా నరికి నదిలో విసిరేసినట్లు పోలీసులకు సోమవారం తెలిపారు. అయితే ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. ముక్కలుగా నరికిన వ్యక్తి శరీర భాగాలు ఆదివారం నాడు జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని అజ్నాల్ నదిలో తేలుతూ కనిపించాయి. 

వీటిని ఫొటోలు తీసిన కొంతమంది, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మృతదేహాన్ని గుర్తించే పనిలో పడ్డారు.చివరకు వారు సక్తాపూర్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల త్రిలోక్‌చంద్‌గా గుర్తించినట్లు పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. ఈ హత్య చేయడానికి కారణం మృతుడి ప్రవర్తనే అని తేలింది. మృతుడు 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. 

దీంతో ఆమె తండ్రి, మామ శనివారం త్రిలోక్‌చంద్‌ను తమ మోటార్‌సైకిల్‌పై అజ్నాల్ నది దగ్గరికి తీసుకెళ్లి, తల నరికి హత్య చేసి, చేపలను కోసేందుకు ఉపయోగించే సాధనంతో మొండెంను రెండు భాగాలుగా నరికారు. ఆ తరువాత ఈ విడి శరీర భాగాలను చెరువులోకి విసిరేశారని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ రాకేష్ పెండ్రో చెప్పారు. నిందితులను అరెస్టు చేశామని, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్నామని, మృతులు, నిందితులు బంధువులని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలో ఇలాంటి దారుణ హత్యే వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ఓ మహిళను అతి దారుణంగా murder చేసి.. తల, శరీర భాగాలను వేరు చేసి పారవేసిన ఘటన narayanpet districtలో సంచలనం సృష్టించింది. నారాయణపేట పట్టణ సమీపంలోని శ్యాసన్ పల్లి రోడ్డు మార్గంలో రోజూ మాదిరి సోమవారం ఉదయం అటుగా వెల్తున్న కొందరికి పెద్దఎత్తున దుర్వాసన వచ్చింది. అనుమానంతో రోడ్డు దిగువన పొలంగట్లవైపు వెళ్లి చూడగా.. ఓ మూటకట్టిన సంచిలో చిన్నపాటి మాంసం ముద్ద ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్ఐ సురేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం మాత్రమే ఉండి, చుట్టు పక్కల మహిళకు సంబంధించిన దుస్తులు లభించాయి. అప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులతో పాటు ఇతర జిల్లాలు పొరుగు ఉన్న కర్ణాటక పోలీసులకు సైతం సమాచారం అందించారు. ఇటీవల శ్యాసన్ పల్లిలో జాతర జరిగిందని, ఆ సమయంలో ఏమైనా గొడవ జరిగిందా .. అక్రమ సంబంధం కారణమా లేదా ఆస్తి వివాదాలతో ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.