తన పొరుగింట్లో ఉన్న స్పెషల్ చైల్డ్ మైనర్‌పై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ప్రతీసారి రూ.50, రూ.20..లు ఆమె మీద విసిరేసి వెళ్లేవాడు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన పొరుగున ఉండే ఓ మైనర్‌ బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పెషల్ చైల్డ్. ఆమె మీద అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెకు డబ్బులు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. 

ఈ విషయం బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం.. చాకేరి ప్రాంతంలోని వారి ఇంటి పక్కనే నిందితుడు ఉంటాడు. అతను ఇంటి టెర్రస్‌మీదినుంచి దొంగతనంగా వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత అక్కడ 50 రూపాయల నోటును వదిలివెళ్లాడు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా అలాగే మరోపారి దాడి చేశాడు. ఈ సారి ఆమెకు రూ.20 ఇచ్చాడు.

ముంబై హాస్టల్‌లో అత్యాచారం, హత్య : గార్డ్ వేధిస్తున్నాడు.. తాకాలని చూస్తున్నాడు.. హాస్టల్ మేట్ తో చెప్పినా...

అయితే, ఈ సారి నిందితుడు వెడుతుండగా బాధితురాలి అక్కకు కనిపించాడు. ఆమెను చూడగానే వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులు బాలికను అడిగి తెలుసుకున్నారు. వెంటనే చెప్పి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

ఈ కేసులో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేశామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారీ తెలిపారు.

బాధితురాలి అక్క చెప్పిన వివరాల ప్రకారం, నిందితుడు వారి ఇంటి పైకప్పులో నుంచి చొరబడి, తన చెల్లెలిపై దాడి చేయడం ఆమె చూసింది. నిందితుడు మూడు రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఒక సందర్భంలో ఆమెపై రూ.100 విసిరినట్లు ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు.