Asianet News TeluguAsianet News Telugu

ఫ్రెండ్స్ లవర్స్‌ కోసం స్పైస్ జెట్ ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదని కాల్ చేశాడు.. నిందితుడు అరెస్టు

ఢిల్లీలో నిన్న స్పైస్ జెట్ ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదని ఓ బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెదిరింపు కాల్ చేసిన యువకుడు అభినవ్ ప్రకాశ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతను తన ఫ్రెండ్స్ వాళ్ల లవర్స్ కోసం ఆ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులకు తెలిపాడు.
 

man who made bomb hoax call to spicejet arrested, says did it for friends lovers
Author
First Published Jan 13, 2023, 8:52 PM IST

న్యూఢిల్లీ: స్పైట్ జెట్‌లో బాంబ్ ఉన్నదని బెదిరింపు కాల్ చేసిన 24 ఏళ్ల అభినవ్ ప్రకాశ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కాల్ తానే చేశానని అంగీకరించిన ప్రకాశ్ మరో కీలక విషయం వెల్లడించాడు. తన మిత్రుల లవర్స్ ఆ ఫ్లైట్‌లో ఉన్నారని, వారిని ఇంకాసేపు ఢిల్లీలోనే ఉంచేలా చేయడానికి ఈ బెదిరింపు కాల్  చేశానని వివరించాడు. 

ఢిల్లీలో నిన్న రాత్రి 9.30 గంటలకు స్పైస్ జెట్ ఫ్లైట్ బయల్దేరి పూణెకు వెళ్లాల్సి ఉన్నది. కానీ, ఆ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో ఎయిర్ లైన్‌కు ఓ కాల్ వచ్చింది. ఆ ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదనే ఫోన్‌లో ఓ వ్యక్తి చెప్పాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ఫ్లైట్ నుంచి ప్రయాణికులు, సిబ్బందిని అందరినీ కిందికి దింపేశారు. విమానం మొత్తం గాలించారు. కానీ, అనుమానించదగ్గ వస్తువులేవీ కనిపించలేదు. అదే సమయంలో ఇది ఒక వేళ నకిలీ ఫోన్ కాలేమో అనే కోణంలోనూ ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేశారు.

ఫ్లైట్‌లోని ప్యాసింజర్లు అందరినీ తనిఖీ చేశారు. 182 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బందిని దింపేశారు. ఫ్లైట్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్దారించుకున్న తర్వాత స్పైస్ జెట్ సెక్యూరిటీ మేనేజర్ వరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్ వచ్చిన నెంబర్‌ను ట్రేస్ చేశారు. ద్వారకాలో నివసిస్తున్న అభినవ్ ప్రకాశ్‌గా నిందితుడిని గుర్తించారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఫ్లైట్‌లో బాంబ్ ఉన్నదని ఫోన్ కాల్.. విమానంలో తనిఖీలు చేస్తున్న అధికారులు

కాల్ చేసింది తానేనని, ఎందుకు చేశానో అనే విషయాన్ని కూడా అభినవ్ ప్రకాశ్ పోలీసుల కు తెలిపాడు. బంటీ, కునాల్ షెరావత్ అనే తన ఫ్రెండ్స్ ఇటీవలే మనాలీ వెళ్లా రని, అక్కడే వారు స్థానిక మహిళలతో పరిచయం పెంచుకుని ఫ్రెండ్స్ అయ్యారని చెప్పాడు. ఆ ఇద్దరు యువతులు స్పైస్ జెట్ ఫ్లైట్స్ ద్వారా పూణెకు వెళ్లిపోతున్నారు. కానీ, తన ఫ్రెండ్స్ ఆ ఇద్దరితో మరికాస్త సమయం గడపాలని అనుకున్నారు. వారిని ఇంకాసేపు అక్కడ ఉండటానికి ఏదైనా ప్లాన్ చేయాలని అభినవ్ ప్రకాశ్‌ను కోరారు.

ఆ ముగ్గురూ కలిసి ప్లాన్ వేశారు. చివరికి అభినవ్ ప్రకాశ్ బాంబ్ ఉన్నదని ఫేక్ కాల్ చేసి ఫ్లైట్ డిలే చేయాలని అనుకుని ఎయిర్ లైన్ కాల్ సెంటర్ కాల్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత ఫ్లైట్‌లోని యువతులకూ విషయం చెప్పాడు. వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బెదిరింపు కాల్ చేసిన నెంబర్‌కు ఎయిర్ లైన్ సిబ్బంది మళ్లీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.

పోలీసులు అభినవ్ ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని ఫ్రెండ్స్ ఇద్దరూ పరారయ్యారు. వారిద్దరినీ పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. 

ప్రకాశ్ గురుగ్రామంలోనిడీఎల్ఎఫ్ ఖుతుబ్ ప్లాజాలో గత ఏడు నెలలుగా  బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో ట్రైనీగా ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios