ఎయిర్‌పోర్ట్ లో కన్నుగప్పి.. తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ..
పంజాబ్ పోలీసుల ఆయుధ చట్టం కేసులో నిందితుడైన కాశ్మీర్ సింగ్ దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లోని ఇద్దరు సిబ్బంది కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సిబ్బందిని సస్పెండ్ చేశారు. డీఎస్పీ సలీం షేక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంటెడ్ నిందితుడు కశ్మీర్ సింగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఓ అధికారి సమాచారమిచ్చారు. వాస్తవానికి వాంటెడ్ నిందితుడు వారి కస్టడీ నుండి తప్పించుకోవడంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
అసలు విషయం ఏమిటి?
పంజాబ్ పోలీసుల ఆయుధ చట్టం కేసులో నిందితుడైన కాశ్మీర్ సింగ్ దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో నుంచి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
ఈ ఘటనపై డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సలీం షేక్ బీ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు కాశ్మీర్ సింగ్ దుబాయ్ వెళ్లాలని ప్రయత్నించాడనీ, డబోలిమ్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
నిందితుడు కశ్మీర్ సింగ్‌ను ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించినప్పటికీ.. నిందితుడు టాయిలెట్‌కు వెళ్లాలనే నెపంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడని తెలిపారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఓ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. సింగ్‌ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని డీఎస్పీ చెప్పారు.