ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వీడియో కాల్ మాట్లాడుతుంగా... అదిపేలడంతో ఓ యువకుడు తన చేతి వేళ్లని పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ కి చెందిన 18ఏళ్ల కుర్రాడు.. పని నిమిత్తం బెంగళూరుకు వచ్చాడు.  భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా... ఇటీవల మధ్యాహ్నం భోజనం సమయంలో.. తన సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి.. కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫోన్ పేలింది.

గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆ కుర్రాడిని చికిత్స నిమిత్తం సమీపంలోకి వైదేహి హాస్పిటల్స్ కి తరలించారు. డాక్టర్లు వెంటనే చికిత్స అందించినప్పటికీ... ఆ కుర్రాడి ఎడమచేతి మూడు వేళ్లు మాత్రం  పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. అతని చేతివేళ్లను కాపాడటానికి ఎంతో ప్రయత్నించామని.. కానీ కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు.