ఈ విషయమై బెనెట్‌రాయన్‌ను ఆమె ప్ర శ్నించగా అతడు ఏమాత్రం తడబడకుండా తనకు ఓ అన్న ఉన్నాడని, అచ్చుగుద్దినట్లు తనలాగే ఉంటాడని సినిమా బాణీలో అబద్ధం చెప్పాడు. 

సినిమాల్లో హీరోలు.. ఒక్కరే ఇద్దరిలా నటించి అందరినీ బురిడి కొట్టించడం లాంటి సీన్లు మీరు చాలానే చూసి ఉంటారు. అలాంటి ప్లానే వేసి ఓ వ్యక్తి ఇద్దరి పెళ్లాడాలని అనుకున్నాడు. అయితే.. సరిగ్గా రెండో పెళ్లి సమయంలో.. అసలు నిజం బయటపడటంతో పారిపోయాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 అరుంబాక్కంకు చెందిన విలాండర్‌ బెనెట్‌రాయన్‌ పోరూరులోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి వివాహ మై పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బెనెట్‌ రాయన్‌కు ఆవడికి చెందిన 21 యేళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. తాను అవివాహితుడనని అబద్దమాడి ఆమెను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించగా, ఇరు వైపు కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. 

బెనెట్‌రాయన్‌ కుటుంబీకులు కట్నం కోసం అతడికి పెళ్లైన విషయాన్ని దాచిపెట్టారు. కాగా పెళ్ళి ఏర్పాట్లు జరుగుతుండగా బెనెట్‌రాయన్‌ వివా హితుడని ఆ యువతికి స్నేహితుల ద్వారా తెలి సింది. ఈ విషయమై బెనెట్‌రాయన్‌ను ఆమె ప్ర శ్నించగా అతడు ఏమాత్రం తడబడకుండా తనకు ఓ అన్న ఉన్నాడని, అచ్చుగుద్దినట్లు తనలాగే ఉంటాడని సినిమా బాణీలో అబద్ధం చెప్పాడు. 

 అబద్ధాన్ని నిజం చేసేందుకు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా తన అన్న వివాహంలో తాను పాల్గొన్నట్లుగా ఓ ఫొటో తయారు చేసి ఆ యువతికి చూపించాడు. దీంతో ఆ యువతి బెనెట్‌రాయన్‌ అన్నను చూడాల ని కోరగా, తన సోదరుడు దుబాయ్‌లో పనిచేస్తున్నాడని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మి ఆ యువతి పెళ్ళికి సిద్ధమైంది. కట్నకానుకలుగా ఆ యువతి తల్లిదండ్రులు బెనెట్‌రాయన్‌ కుటుంబీకులకు రూ.3.5 లక్షల నగదు ముట్ట జెప్పారు. 

పెళ్ళి ఏ ర్పాట్లు జరుగుతున్న సమయంలో యువతి బంధువు ఒకరు బెనెట్‌రాయన్‌ ఆడుతున్న డబుల్‌రోల్‌ నాటకం గుట్టును ఆధారాలతో సహా బట్టబయలు చేయడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నంగా ఇచ్చిన రూ.3.5 లక్షల నగదును తిరిగి చెల్లించమని అడిగిన యువతిని, ఆమె తల్లిదండ్రులను బెనెట్‌రాయన్‌, అతడి కుటుం బీకులు చంపుతామంటూ బెదరించారు. 

దీంతో ఆగ్రహం చెందిన యువతి తల్లిదండ్రులు ఆవడి మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెనెట్‌రాయన్‌, అతడి తల్లి సెలినా రాయన్‌ ఇంటి నుంచి పారిపోయారు. ఆ తల్లీకొడు కుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.