కట్టుకున్న భర్తే భార్యను వేరే వ్యక్తికి అమ్మేశాడు...ఎంతకో తెలుసా?

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 11, Aug 2018, 10:50 AM IST
Man tries to sell wife, but the buyer is a policeman
Highlights

కట్టుకున్న భార్యను స్వయంగా భర్తే వ్యభిచార కూపంలోకి నెట్టేయడానికి ప్రయత్నించిన సంఘటన దేశ రాజధాని డిల్లీలో చోటుచేసుకుంది. అందమైన తన భార్యను వ్యభిచార గృహ నిర్వహకులకు విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకున్నాడో ప్రబుద్దుడు. అయితే చివరకు ఇతడి నీచమైన పని గురించి పోలీసులకు తెలియడంతో కటకటాలపాలయ్యాడు.

బీహార్లోని హరారియా గ్రామానికి చెందిన సద్దాం అనే వ్యక్తి రెండు పెళ్లిల్లు చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా రెండో భార్యతో సద్దాంకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడు తన రెండో భార్య అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. ఆమె హత్యకోసం పథకంమ కూడా రచించాడు. అయితే సద్దాంకు తన అందమైన భార్యను ఊరికే చంపడం కంటే ఆమెతో వ్యభిచారం చేయించి తన పగ తీర్చుకోవడంతో పాటు డబ్బులు కూడా సంపాదించొచ్చనే నీచపు ఆలోచన కలిగింది. దీంతో సద్దాం అందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

భార్యను విక్రయించడానికి సద్దాం డిల్లీలోని కమలా మార్కెట్ లో బేరం పెట్టాడు. ఈ విషయం తెలిసిన ఓ పోలీస్ ఇన్ఫార్మర్ సద్దాంతో అతడి భార్యను కొనుక్కోడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. లక్షా ఇరవై వేల రూపాయలకు అమ్మడానికి సద్దాంకు ఒప్పుకున్నాడు. అయితే పదివేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని భార్యను అప్పగిస్తుండగా, ముందే ఇన్పార్మర్ ఇచ్చిన సమాచారంతో మప్టీలో కాపుకాసిన పోలీసులు నిందితుడు సద్దాంను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.  నిందితున్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

loader