Asianet News TeluguAsianet News Telugu

భార్యతో గొడవపడి.. రెండేళ్ల కొడుకును బాల్కనీలోనుంచి విసిరేసిన తండ్రి..

భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కొడుకును మూడంతస్తుల బాల్కనీలో నుంచి కిందికి విసిరేశాడు. ఆపై తానూ దూకేశాడు.
 

Man Throws 2-Year-Old Son From Balcony in Delhi
Author
First Published Dec 17, 2022, 1:00 PM IST

న్యూఢిల్లీ : భార్యతో తీవ్ర వాగ్వాదం తర్వాత ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనం బాల్కనీపై నుంచి కిందకు విసిరేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ తరువాత తానూ దూకాడు. ఈ ఘటనలో తండ్రీ కొడుకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని కల్కాజీ వద్ద గల మురికివాడలో నిన్న రాత్రి జరిగింది.

మాన్ సింగ్, అతని భార్య పూజకు గత కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ గొడవల కారణంగా పూజ ఇంట్లోనుంచి వచ్చేసింది. ఇద్దరు పిల్లలతో సహా కల్కాజీలోని అమ్మగారింటికి వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వారిని కలిసేందుకు మాన్ సింగ్ వచ్చాడు. కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తరువాత... ఆవేశంతో కుమారుడిని బాల్కనీ నుంచి తోసేసి ఆపై దూకేశాడు. అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ లో మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో పట్టరాని కోపంలో విచక్షణ కోల్పోయి.. ఓ వ్యక్తి చేసిన పని చివరికి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 30 ఏళ్ల ఓ వ్యవసాయ కూలీ తన భార్యతో గొడవపడి.. ఆ  కోపంతో తమ ఏడాదిన్నర కుమార్తెను వ్యవసాయ బావిలోకి విసిరేశాడు. దీంతో శిశువు మృతి చెందింది. జాల్నా తహసీల్‌లోని నిధినా గ్రామంలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జగన్నాథ్ ధాక్నే అనే సదరు నిందితుడిని ఆ తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. 

ఔరంగాబాద్ జిల్లాలోని సిల్లోడ్ నుంచి రెండు నెలల క్రితం ధాక్నే తన భార్య, నెలల వయసున్న కుమార్తెతో కలిసి పొలంలోపని చేసేందుకు జల్నాకు వచ్చాడు. కాగా ఆ రోజు ఉదయం భార్యభర్తల మధ్య ఏదో విషయంగా గొడవ జరిగింది. ఇది వాగ్వాదంగా మారింది. దీంతో భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విచక్షణ కోల్పోయాడు. భార్య మీది కోపంతో ఊయలలో నిద్రిస్తున్న పసికందును తీసుకెళ్లి దగ్గర్లోని వ్యవసాయ బావిలో పడేశాడు. ఈ విషయం భార్యకు తెలియదు. అయితే ఆ తరువాత కూతురు కనిపించడం లేదన్న విషయం గుర్తించిన భార్య.. అంతటా వెతికినా ఫలితం లేకపోయింది. చిన్నారిని చెరువులో పడేసిన విషయం చెప్పకుండా భర్త కూడా ఆమెతో కలిసి ఏమీ తెలియనట్టు వెతకడం ప్రారంభించాడు. 

ఎంతకీ పాప ఆచూకీ దొరకకపోవడంతో.. పాప కనిపించడంలేదంటూ చందంజీరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి కంప్టైంట్ తో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సమయంలో తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో కాస్త గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యమీద కోపంతో చిన్నారిని అతనే హత్య చేసి.. మిస్సింగ్ డ్రామా ఆడినట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు  ధాక్నేపై హత్య కేసు నమోదు చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios