దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు సాగుతుండగా ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు.

అక్కడ న్యాయవాదులు, కక్షిదారులు ఉండగానే ఎడమచేతిని కోసుకున్నాడు. దీంతో అక్కడున్న  సిబ్బంది అతడిని రక్షించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతని చేతికి రుమాలు చుట్టి ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .