పాట్నా: బీహార్ రాష్ట్రంలో ముంగేర్ ‌లో శుక్రవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఉన్మాది హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో  కలకలం రేపింది.

ముంగేర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తల్లి,భార్యతో పాటు ముగ్గురు పిల్లలను కూడ అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఐదుగురిని హత్య చేసిన తర్వాత భవనం నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు, ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.