భార్యకు తనకంటే ఎక్కువ ఇన్ స్టా ఫాలోవర్స్ ఉండడం తట్టుకోలేని ఓ భర్త ఆమెను గొంతునులిమి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన లక్నోలో వెలుగు చూసింది.
లక్నో: లక్నోకు చెందిన 37 ఏళ్ల వ్యాపారవేత్త ఆదివారం ఉదయం సుల్తాన్‌పూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై తన ఎస్‌యూవీలో తమ ఇద్దరు పిల్లల ముందే 15 ఏళ్ల తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. పోలీసుల ప్రకారం, అతని భార్యకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ తనకంటే ఎక్కువ ఉండడంతో అతడిలో ఏర్పడిన "ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్" ఈ హత్యకు కారణంగా కనిపిస్తుందన్నారు.
బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ప్రస్తుతం లాక్ చేయబడి, ప్రైవేట్‌గా ఉంది. దీన్ని అధికారులు పరిశీలించాల్సి ఉంది. బాధితురాలు తన భర్తను తన ఇన్ స్టా అకౌంట్ బ్లాక్ చేసింది. ఇది కూడా అతనిలో అభద్రతా భావం కలిగించింది. అతను లేనప్పుడు ఆమె సోషల్ మీడియా అభిమానులు కొందరు ఆమెను కలుస్తున్నారని నిందితుడు అనుమానించాడు.
శాంతించిన నుహ్.. రెండు వారాల తరువాత ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ..
ఇది వారి మధ్య గొడవలకు దారితీసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలుపుతూ పోలీసులు.. కురేభర్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ: "నిందితుడికి టూర్, ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అతని భార్య గృహిణి. ఈ జంట లక్నోలోని పారా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి 12 ఏళ్ల కుమార్తె , ఐదేళ్ల కొడుకు ఉన్నారు" అని తెలిపారు.
పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుతూ... ఈ దంపతులు ఆదివారం ఉదయం రాయ్‌బరేలీకి వెళదామని ఇంట్లోనుంచి బయలుదేరారు. కానీ రాయ్‌బరేలీకి కాకుండా, బదులుగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి మళ్లించారు. తెల్లవారుజామున 5 గంటలకు, నిందితుడు సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి దగ్గర కారు ఆపాడు.
అక్కడ తన భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ భయానక దృశ్యాన్ని చూసి వారి పిల్లలిద్దరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నీరుమున్నీరయ్యారు. ఆతరువాత చనిపోయిన భార్యను నిందితుడు ఎస్‌యూవీలోకి లాక్కెళ్లాడు.
యూపీఈఐడీఏకు చెందిన పెట్రోలింగ్ బృందం వాహనం అనుమానాస్పదంగా పార్క్ చేయడాన్ని గమనించింది. వెంటనే వారు అనుమానంతో పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారు. వారి సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండ్రే తన తల్లిని హత్య చేశాడన్న భయంకరమైన నిజాన్ని దంపతుల కుమార్తె వెల్లడించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
