అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి పనికి వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చిన తరువాత...

మహారాష్ట్ర : ఓ వ్యక్తి భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లో పెట్టి తాళం పెట్టి.. ఏమీ తెలియనట్టుగా పనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సాయంత్రం తిరిగి వచ్చాక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తన భార్యను చంపినట్లు అంగీకరించి, లొంగిపోయిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

నలసోపరా నివాసి అయిన నిందితుడు సోమవారం (మార్చి 14) తెల్లవారుజామున తన భార్యను గొంతు కోసి చంపాడని పాల్హార్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. భార్యను హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి యథావిధిగా పనికి వెళ్లాడు. సాయంత్రం పని నుంచి బయటకు వచ్చిన తర్వాత హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసి లొంగిపోయాడు. భార్యపై అనుమానంతో నిందితుడు తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.భార్యను హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి యథావిధిగా పనికి వెళ్లాడు. సాయంత్రం పని నుంచి వచ్చిన తర్వాత హత్య జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసి లొంగిపోయాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

గర్ల్‌ఫ్రెండ్‌తో కొడుకు ఫొటోలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్ ఇదే.. ‘ఆయనకు 18 ఏళ్లు’

ఇదిలా ఉండగా, ఏపీలోని చిత్తూరులో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ కామాంధుడు తల్లీ, కూతుర్లను హతమార్చాడు. ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు రుజువడంతో.. సోమవారం సదరు వ్యక్తికి చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలోని గంగిరెడ్డి కాలనీకి చెందిన సయ్యద్ మౌలాలి (47)కి ఈ శిక్ష పడింది. అతను చేపల చెరువులను లీజుకు తీసుకుని.. చేపలు పట్టి అమ్మే వ్యాపారం చేస్తుంటాడు. అదే మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన 37 ఏళ్ల సరళమ్మ భర్త మరణించాడు. ఈ క్రమంలో మౌలాలికి ఆమెతో పరిచయమైంది. దీంతో కొన్నేళ్ల పాటు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి కూడా ఆమెతో పాటే ఉంటుంది. ఈ క్రమంలో మౌలాలి సరళమ్మ మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమె వేరే మగవాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుందని పొలం వద్ద రాత్రిపూట గొడవ పెట్టుకున్నాడు. అక్కడే ఉన్న కర్రతో ఆమె తల మీద గట్టిగా కొట్టాడు. 

ఈ దెబ్బలతో ఆమె చనిపోవడంతో ఆమె మృతదేహాన్నిపెద్దేరు ప్రాజెక్టులో పడేశాడు. సరళమ్మ తల్లి గంగులమ్మ కూతురు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని మౌలాలిని నిలదీసింది. దీంతో మౌలాలి తెల్లారేసరికి ఆమె వస్తుందని గంగులమ్మకి చెప్పి నమ్మించాడు. నిద్రపోయిన తర్వాత ఆమె చీర కొంగుతో గొంతును బిగించి చంపేశాడు. ఆ తర్వాత సరళమ్మ తల్లి గంగులమ్మ శవాన్ని కూడా ఓ చెరువులోకి తీసుకెళ్లి పడేశాడు. సరళమ్మ కూతుర్లు.. తెల్లవారిన తర్వాత.. అమ్మ, అమ్మమ్మ ఎక్కడున్నారని మౌలాలిని నిలదీశారు. వారి అమ్మ, అమ్మమ్మలకు కరోనా వచ్చిందని... అందుకని ఆసుపత్రిలో చేర్పించానని తెలిపాడు. ఈ క్రమంలో వారితో పాటే ఇంట్లో ఉండడం.. ఇంట్లోనే పడుకోవడం చేసేవాడు. 

ఈ సమయంలో ఒకరోజు పెద్దమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. నెల రోజులపాటు ఈ అఘాయిత్యాన్ని అలాగే కొనసాగించాడు. ఆ తరువాత వారిని అక్కడ నుంచి తరలించి కర్ణాటకలోని గౌనిపల్లెలోని ఓ ఇంట్లో ఉంచాడు. ఓవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు.. సరళమ్మ, ఆమె తల్లి గంగులమ్మ, ఆమె ముగ్గురు కుమార్తెలు కనిపించకుండా పోవడంతో.. బంధువులకు అనుమానం వచ్చింది.

వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సయ్యద్ మౌలాలిని విచారించారు. ఆ తర్వాత అతనిని అరెస్టు చేశారు. అభియోగాలు న్యాయస్థానంలో రుజువయ్యాయి. దీంతో న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ.. మరణించేంతవరకు జైలులో ఉండాలని శిక్ష విధించారు.