రాంగ్ రూట్‌లో కారును పోనివ్వడానికి ప్రయత్నించడమే కాకుండా.. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌పైకి కారును ఎక్కించాడు ఓ వ్యక్తి. బుధవారం గురుగ్రామ్‌లోని సిగ్నేచర్ టవర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రాంగ్ రూట్‌లో వెళుతున్న కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే ఆ కారులో ఉన్న వ్యక్తి పోలీసు నుంచి తప్పించుకోవడానికి కారును రివర్స్ చేశాడు. కారును వెనక్కి తీసినట్లుగా తీసి కానిస్టేబుల్ రాగానే ముందుకు పోనిచ్చాడు. అది ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్ కారు ముందు భాగాన్ని పట్టుకున్నాడు.
అయినా ఆ వ్యక్తి బానెట్‌పై కానిస్టేబుల్ పడుకున్నా పట్టించుకోకుండా...అలాగే ముందుకు వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన మిగిలిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. ఈ ఘటనను అక్కడున్న వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది.