దాదాపు రెండు సంవత్సరాలు లగ్జరీ హోటల్ లో బస చేశాడు. కానీ రూపాయి కూడా చెల్లించలేదు.  ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చాలా మంది సెలబ్రెటీలు, స్టార్స్ ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లినప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేస్తూ ఉంటారు. సామాన్యులు అయితే, ఆ హోటల్ చుట్టుపక్కలకు కూడా వెళ్లే సాహసం చేయరు. ఎందుకంటే ఆ హోటల్ బిల్లులు అలా ఉంటాయి. ఒక్కరోజుకి వేలల్లో ఛార్జ్ చేస్తారు. కొన్ని లక్షల్లో చేసిన ఆశ్చర్యపోనవరసరం లేదు. అక్కడ సదుపాయాలు కూడా అలానే ఉంటాయి. కళ్లు చెదిరే గదులు, నోరూరించే రకరకాల ఫుడ్స్, స్విమ్మింగ్ పూల్స్.. ఇలా స్వర్గం ఇలానే ఉంటుందా అనే సందేహం కలగకమానదు.

అందుకే వారు కూడా అంత ఛార్జ్ చేస్తారు. డబ్బు ఉన్నవారు కూడా అలాంటి ప్రదేశాలకే వెళుతూ ఉంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం దాదాపు రెండు సంవత్సరాలు లగ్జరీ హోటల్ లో బస చేశాడు. కానీ రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఎరోసిటీలో రోసెట్ హైస్ అనే లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అందులో ఓ వ్యక్తి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రెండేళ్ల పాటు హోటల్ లో ఉండటం విశేషం. బిల్లు కట్టకుండా ఎలా ఉండనిస్తారు అనే సందేహం మీకు కలగొచ్చు. అతను హోటల్ సిబ్బందికి టిప్స్ తో ఆశ చూపించి, మెయిన్ గా కట్టాల్సిన హోటల్ బిల్లు కట్టకుండా తప్పించుకున్నాడు. అలా దాదాపు రెండుళ్లు చేయడం గమనార్హం.

దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయం హోటల్ మేనేజర్ కి తెలియడం గమనార్హం. దాదాపు అతని కారణంగా రూ.58లక్షల నష్టం వాటిల్లిందని వారు గుర్తించారు. అంకుశ్ దత్తా 2019లో ఒక్కరోజు హోటల్ లో స్టే కావాలని చెప్పి మే 30వ తేదీన అక్కడకు వచ్చాడు. కానీ ఆయన 2022 జనవరి 22 వరకు అదే హోటల్ లో ఉండటం విశేషం.

మొత్తం 603 రోజులు ఉన్నాడు. బిల్లు చెల్లించకుండా నెమ్మదిగా జారుకున్నాడు. హోటల్ ఆడిట్ రికార్డులు చెక్ చేస్తుంటే ఈ విషయం బయట పడటం గమనార్హం. దీంతో హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి బిల్లు చెల్లింకుండా ఒక్క రోజు ఎక్కువ ఉన్నా, సిబ్బంది పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఈయన విషయంలో అలా జరగకపోవడంతో అసలు విషయం బయటపడలేదు.