ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బట్టలు విప్పేసి నగ్నంగా ఉపాధి హామీకూలీలు పనిచేసే చోటికి వెళ్లి వారిని ఇబ్బందికి గురి చేశాడు.
తమిళనాడు : ఉపాధి హామీ కూలీలతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో నగ్నంగా నిలబడి మరీ వారిని వేదించాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిమీద విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు స్థానికంగా ఉపాధి హామీ పనులు చేస్తున్నారు.
మంగళవారం నాడు ఓ వ్యక్తి మద్యం మత్తులో వారి వద్దకు వెళ్లాడు. అతన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకరన్ గా గుర్తించారు. వారి దగ్గరికి వెళ్లిన ప్రభాకరన్ బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అది చూసిన మహిళలు ముందు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత అతడి ప్రవర్తన మీద పులరంబాక్కం పోలీస్ స్టేషన్ కి బుధవారం ఉదయం వెళ్లి ఫిర్యాదు చేశారు.
భారత జనాభాలో సగానికి పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్.. డిజిటల్ చెల్లింపుల్లో 13 శాతం పెరుగుదల..!
అయితే, వీరి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మహిళలంతా కలిసి తిరువళ్లూరు-ఊత్తుకోట మార్గంలో రాస్తారోకో చేపట్టారు. దీని ఫలితంగా ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం పోలీసుల వరకు చేరిందన్న సమాచారం తెలియడంతో వారికి దొరకకుండా ప్రభాకరన్ ముళ్లపొదల్లో దాక్కున్నాడు. అతడిని గాలించిన పోలీసులు ముళ్ళ పొదల్లో నుంచి అదుపులోకి తీసుకున్నారు. దీనిమీద విచారణ చేపట్టారు. ప్రభాకరన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. మహిళలు ఆందోళన విరమించారు.
