అంతకు ముందే పెళ్లైనా.. పెళ్లి కాలేదని చెప్పి ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక విషయం తెలిసిన ఆమె విడాకులు కోరింది. దీంతో కక్ష పెంచుకుని కత్తితో దాడికి తెగబడ్డాడు. 22సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. 

బెంగళూరు : casts వేరైనా అతనికోసం పేరు మార్చుకుని మరీ వివాహం చేసుకుంది. అంతా హాయిగా ఉంది అనుకునేలోపే... husband గురించి ఒక చేదు నిజం తెలుసుకుని షాక్ కు గురైన ఆమె.. ఇక నీతో ఉండలేనంటూ కోర్టులో Divorce కోసం దాఖలు చేసింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అతను కక్షతో అందరూ చూస్తుండగానే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన Karnatakaలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్‌ని అపూర్వ పురాణిక్ తన పేరు మార్చుకుని మరి వివాహం చేసుకుంది. అయితే అతనికి ఇంతకుముందు వివాహమై, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే విషయం దాచి పెట్టి.. మరీ అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తాను చదువుకుంటున్నానని.. పార్ట్ టైం ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నానని మాయమాటలు చెప్పి అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఇక భర్త చేసిన మోసం తెలుసుకున్న అపూర్వ తనతో ఉండకూడదు అని నిర్ణయించుకుని కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో కక్షపెంచుకున్న అతను అపూర్వ కదలికలపై నిఘా పెట్టి మరీ ఆమెపై దాడి చేసేందుకు ఉపక్రమించాడు. అందులో భాగంగానే ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా కొడవలితో కిరాతకంగా ఆమె మీద దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పైగా ఆమె శరీరంపై దాదాపు 22 గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో.. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెబుతున్నట్టుగా ‘మీ ధర్మానికి విరుద్ధంగా వివాహం చేసుకోకండి’ అని ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. 

ఇదిలా ఉండగా, ఓ భర్త భార్య కాళ్ళు నరికి murder attempt చేసిన ఘటన తుమకూరు నగరంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గదగ్ కు చెందిన బాబు, తుమకూరు మధుగిరికి చెందిన అనిత(30)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకోవాలని విడివిడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో భార్య మీద murder plan రచించాడు భర్త. దీనిప్రకారం గురువారం ఉదయం నుంచి బాబు తుమకూరు చేరుకున్నాడు.

అనితను కూడా మాట్లాడుకుందామని పిలిపించాడు. ఇద్దరు ఓ హోటల్లో అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ లాడ్జ్ వద్ద ఉన్న ఓ నిర్జన ప్రదేశంలోకి చేరుకున్నారు అక్కడ గొడవపడ్డారు. పథకం ప్రకారం తీసుకువచ్చిన కత్తి తీసుకుని ఆమె కాళ్లు నరికాడు. అక్కడి నుంచి ఓ హోటల్కు వెళ్లి ఆ విషయాన్ని అక్కడి సిబ్బందికి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేక ఇలా చేశానని బాబు పోలీసులకు వివరించాడు.