మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ్ ఏరియాలో హోలి వేడుకలకు స్టెప్పులు వేస్తున్న గోపాల్ సోలాంకి చేతిలో కత్తి పట్టుకున్న విషయాన్ని మరిచాడు. ఓ స్టంట్ వేయబోయి చేతిలోని కత్తితోనే చాతికి నాలుగు సార్లు చరిచాడు. ఆ కత్తి గోపాల్ సోలాంకి చాతిలోకి దిగింది. రక్తం ధారలా ఉబికి వచ్చింది. ఆ తర్వాత గోపాల్ సోలాంకికి తెలియవచ్చింది. ఆయనను హాస్పిటల్ తరలించారు. కానీ, చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు చెప్పారు. 

న్యూఢిల్లీ: హోలీ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ్ ఏరియాలో పూటుగా తాగిన ఓ వ్యక్తి మిత్రులతో కలిసి చిందులు వేశాడు. పెద్దగా సౌండ్ పెట్టుకుని స్టెప్పులు వేశాడు. ఇలా ఓ స్టంట్ వేయబోయి చేతిలోని కత్తితో చాతిలో పొడుచుకున్నాడు. నాలుగు సార్లు పొడుచుకున్నాక గానీ, ఆయన రియలైజ్ కాలేడు. రక్తం కారుతుంటే చూసుకుని వెంటనే పక్కకు తప్పుకున్నాడు. బంధు మిత్రులు అది గమనించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఆ వ్యక్తి మరణించినట్టు వైద్యులు చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని బాంగాంగ ఏరియాలో గోపాల్ సోలాంకి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆ రాత్రి పూట ఇంటి ముందు సౌండ్ బాక్సులు పెట్టుకుని మిత్రులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఎందుకో గానీ, ఆయన తన చేతిలోకి కత్తి తీసుకున్నాడు. కొంత సేపు మ్యూజిక్‌కు అనుగుణంగా మత్తులోనే తూలుతూ కనిపించాడు. పాటకు తగినట్టుగా ఆయన ఓ స్టెప్ వేయబోయాడు. చేతిలో తాను కత్తి పట్టుకున్నాననే విషయాన్ని మరిచిపోయాడు.

Scroll to load tweet…

గుండెపై చేయి వేస్తూ స్టెప్ వేయాలి అని అనుకున్న గోపాల్ సోలాంకి చేతిలో కత్తితోపాటుగా అలాగే.. గుండెపై నాలుగు సార్లు పోటు పొడుచుకున్నాడు. ఆ కత్తి గోపాల్ సోలాంకి చాతిలోకి దిగింది. నాలుగు పోట్లు పడ్డాయి. వెంటనే రక్తం బయటకు చిమ్మింది. చేయి రక్తంతో తడి కావడంతో వెంటనే ఆయన తన చాతి వైపు చూసుకున్నాడు. చాతిలో నుంచి రక్తం ధారలా బయటకు పొంగింది. వెంటనే జరిగిన ముప్పును గుర్తించి డ్యాన్స్ చేసే స్థలం నుంచి తప్పుకున్నాడు. కానీ, ఆయనతో డ్యాన్స్ చేస్తున్నవారు అది కూడా గమనించకుండా స్టెప్పులు వేస్తూనే ఉన్నారు. ఈ తతంగమంతా కెమెరాలో రికార్డ్ అయింది.

గోపాల్ సోలాంకి మిత్రులు రక్తాన్ని చూడగానే వెంటనే పరుగున ఆయన వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆయనను అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. కానీ, గోపాల్ సోలాంకి బతకలేదు. చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు నిర్ధారించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోనూ సంబురాలు జరిగాయి. సాధారణ ప్రజలు సహా చట్టసభ్యులూ ఈ రంగుల వేడుకలో మునిగితేలారు.శుక్రవారం నాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే Shankar Naik కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు. liquor బాటిల్ ను చేతబట్టుకొని కార్యకర్తల నోట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా మందు పోశారు. ఒక్క చేతిలో మద్యం గ్లాసును చేతిలో పట్టుకొని మరో చేతిలో మద్యం బాటిల్ తో కార్యకర్తల నోట్లో మద్యం పోశారు. హోలీ వేడుకలను ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వద్ద జరుపుకున్నారు. క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన వారితో కలిసి ఎమ్మెల్యే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.